ఒకే ఆధార్‌తో... 9 మొబైల్ కనెక్షన్లు

ఢిల్లీ వాసి ఆర్.డి ప్రియ అనే విద్యార్థిని ఇటీవలే మొబైల్ కనెక్షన్ తీసుకుందామని స్థానిక ఎయిర్ టెల్ స్టోరుకి వెళ్లింది. 

Last Updated : Jan 22, 2018, 11:55 AM IST
ఒకే ఆధార్‌తో... 9 మొబైల్ కనెక్షన్లు

ఢిల్లీ వాసి ఆర్.డి ప్రియ అనే విద్యార్థిని ఇటీవలే మొబైల్ కనెక్షన్ తీసుకుందామని స్థానిక ఎయిర్ టెల్ స్టోరుకి వెళ్లింది. అయితే ఇప్పటికే ఆమె పేరు మీద తొమ్మిది మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని తెలియడంతో ఆమె షాక్‌కి గురైంది. వివరాల్లోకి వెళితే.. కొత్త సిమ్‌ కార్డు ఇచ్చేటప్పడు  మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని భావిస్తే.. ఆయా సర్వీస్ ప్రొవైడర్ల ఏజెంట్లు లేదా కంపెని ప్రతినిధులు కస్టమర్ వేలి ముద్రలను బయోమెట్రిక్ ద్వారా స్కాన్‌ చేసి ఆధార్‌ డేటాతో పోల్చి అప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది.

అయితే తాజా కేసులో అలాంటి నిర్థారణ ఏమీ లేకుండానే కస్టమర్‌కి మొబైల్ కనెక్షన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్.డి ప్రియ కేసు ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఏఐ సంస్థ వరకూ వెళ్లింది. వారు ఎయిర్‌టెల్ యాజమాన్యాన్ని కూడా సంప్రదించారు. ఈ క్రమంలో యూఐడీఏఐ మరో ప్రకటన జారీ చేసింది. తమ ఆధార్ నెంబరుతో అనుసంధానమై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం వినియోగదారుల హక్కు అని కూడా తెలిపింది. ఒకవేళ ఇతరులు ఆధార్ కార్డు ఉపయోగించి సిమ్స్ జారీ చేస్తే.. అలా చేసే సంస్థలపై చట్టప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిందేనని లేదా ట్రాయ్‌కి ఫిర్యాదు చేయవచ్చని కూడా తెలియజేసింది. 

Trending News