Bihar corona restrictions: దేశంలో కరోనా భయాలు.. ఆంక్షల చట్రంలోకి బిహార్​!

Bihar corona restrictions: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బిహార్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించింది. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు మూసివేత సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 12:59 AM IST
  • బిహార్​లో కఠిన కొవిడ్ ఆంక్షలు
  • స్కూళ్లు, సినిమా హాళ్లు మూత
  • తక్షణమే అమలులోకి ప్రభుత్వ ఆదేశాలు
Bihar corona restrictions: దేశంలో కరోనా భయాలు.. ఆంక్షల చట్రంలోకి బిహార్​!

Bihar corona restrictions: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, ఒమిక్రాన్ భయాల (Omicrona scare) నేపథ్యంలో మరో రాష్ట్రం కూడా ఆంక్షల చట్రంలోకి వెళ్లింది. బిహార్​లో లాక్​డౌన్ తరహా ఆంక్షలు విధించింది ప్రభుత్వం.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకుగానూ.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్​ సెంటర్లు, హోటళ్లు, జిమ్​లు మూసివేయాలని (Educational institutions closed in Bihar) నిర్ణయంచింది రాష్ట్ర యంత్రాంగం. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 వరకు తాజా ఆదేశాలు అమలులో (Cinema halls closed in Bihar) ఉంటాయని వెల్లడించింది.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే పని చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ విషయంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ట్వీట్ (CM Nitish Kumar Coron)​ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

పరీక్షలకు అనుమతి..

స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించినప్పటికీ.. ఉద్యోగ సంబంధి పరీక్షలు నిర్వహించేందుకు మాత్రం అనుమతినిచ్చింది ప్రభుత్వం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వాటిని నిర్వహించాలని పేర్కొంది. ఆన్​లైన్ క్లాస్​లు కూడా నిర్వహించుకోవచ్చని వివరించింది.

సమావేశాలు, పెళ్లిళ్లు ఇతర వేడుకలపై కూడా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. పరిమిత సంఖ్యలో జనాలతో వీటిని నిర్వహించుకునే వీలుంది.

మరోవైపు నిత్యవసర దుకాణాలు తప్ప మిగతా షాప్​లు రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆంక్షలన్ని తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also read: Corona in India: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం- ఒక్క ముంబయిలోనే 20 వేలకుపైగా కేసులు

Also read: Omicron scare: కేరళలో ఒమిక్రాన్​ విజృంభణ- కొత్తగా 50 మందికి పాజిటివ్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News