పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు మరోసారి ఛేదు అనుభవం

పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు. రోజు రోజుకు ఇంకా రగులుతూనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Last Updated : Jan 28, 2020, 01:45 PM IST
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు మరోసారి ఛేదు అనుభవం

పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా చెలరేగిన దుమారం సమసిపోవడం లేదు. రోజు రోజుకు ఇంకా రగులుతూనే కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారంపక్షంలో ఉన్నప్పటికీ రోజూ ఆమె స్వయంగా ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు  ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ నిన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకార్‌కు .. సీఎం మమతా బెనర్జీకి పౌరసత్వ సవరణ చట్టం విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప్పు-నిప్పులా ఉన్న వీరిద్దరూ పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జగదీప్ ధంకార్ ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఛేదు అనుభవం ఎదురవుతోంది.  కోల్‌కతా యూనివర్శిటీకి వెళ్లిన ఆయన్ను అక్కడి విద్యార్థులు అడ్డుకున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ జగదీప్ ధంకార్ హాజరు కావొద్దంటూ ఘెరావ్ చేశారు.  కనీసం ఆయన్ను  కారు కూడా దిగనివ్వలేదు.  'గవర్నర్ గో బ్యాక్' అంటూ నినాదాలు కొనసాగించారు. దీంతో గవర్నర్ భద్రతా సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోయారు. 

Trending News