భారత ఆర్మీ 2016 సెప్టెంబర్ నెలాఖరులో జరిపిన సునిశిత దాడికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత విడుదల చేసిన ఈ వీడియోను.. భారత ఆర్మీకి చెందిన ఓ జవాను హెడ్ మౌంటెన్ (టోపీకి బిగించే) కెమరాతో చిత్రీకరించారు. దీనిలో భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తూ కనిపించింది. తెల్లవారుజాము సమయంలో పాక్ సరిహద్దుల్లోకి ప్రవేశించి ఉగ్రస్థావరాలను ఆర్మీ ద్వంసం చేసింది. భారత ఆర్మీ చేసిన ఈ దాడిని దేశ ప్రజలు, ప్రభుత్వంతో పాటు అనేక దేశాలు ప్రశంసించడం తెలిసిందే..!
ఓట్లను సంపాదించుకోవడానికే..: కాంగ్రెస్ విమర్శ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను విడుదల చేయడం ఓట్లను సంపాదించుకోవడానికేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై ఆ పార్టీ నాయకుడు రణ్‌దీప్ సుర్జీవాలా మీడియాతో మాట్లాడుతూ, సైన్యం చేసిన త్యాగాలను ఓట్లు పొందడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవడాన్ని విమర్శించారు. సైన్యం త్యాగాలు చేస్తే మోదీ ఖ్యాతిని పెంచుకున్నారన్నారు.
The ruling party will have to remember that they cannot make the sacrifice of the Army a tool to garner votes for them. It is the soldiers who sacrificed their lives and it is Modi ji who was glorified: Randeep Surjewala, Congress on the release of #SurgicalStrike video pic.twitter.com/QL9worG6pL
— ANI (@ANI) June 28, 2018
సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ ఫలితం లేదు: జేడీ(యూ)
సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ ఫలితం లేదని, పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోందని జేడీయూ విమర్శించింది. జేడీయూ నేత పవన్ వర్మ మాట్లాడుతూ పాకిస్తాన్‌కు గట్టిగా సమాధానమివ్వడానికి కేంద్రానికి ఇంకా ఏం కావాలని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా.. పాకిస్తాన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పారు.