హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తి చనిపోయాడా ? అనేక అనుమానాలకు తావిస్తోన్న సిద్ధిఖి మృతి!

'కరోనా వైరస్' ప్రపంచ దేశాలతో సహా భారత దేశాన్ని కూడా గజ గజా వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 4 వేల మంది వరకు మృతి చెందారు. తాజాగా హైదరాబాద్‌లోనూ 'కరోనా వైరస్' సోకినట్లుగా అనుమానం ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడనే అనుమానాలు కలకలం సృష్టిస్తున్నాయి.

Last Updated : Mar 11, 2020, 03:35 PM IST
హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తి చనిపోయాడా ? అనేక అనుమానాలకు తావిస్తోన్న సిద్ధిఖి మృతి!

'కరోనా వైరస్' ప్రపంచ దేశాలతో సహా భారత దేశాన్ని కూడా గజగజా వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 4 వేల మంది వరకు మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో 'కరోనా వైరస్' సోకినట్లుగా అనుమానం ఉన్న ఓ వ్యక్తి మృతి చెందడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిని కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ సిద్ధిఖీగా గుర్తించారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. కరోనా వైరస్ సోకిందని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చాడు. కరోనా సోకిందనే అనుమానంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న వ్యక్తి చనిపోయాడని తెలియడంతో తెలంగాణతోపాటు కర్ణాటక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనావైరస్ వల్లే అతడు చనిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Read Also: 'యోగా'తో సంతాన యోగం

కర్ణాటకకు చెందిన సిద్ధిఖీ అసలు కరోనా వైరస్ వల్లే మృతి చెందాడా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు ఆదేశాల మేరకు కలబుర్గి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధిఖీ అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి అనుమానితుడే కావడంతో ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి శ్రీరాములు అందరికీ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన కన్నడ భాషలో ఓ ట్వీట్ చేశారు. అయితే, సిద్ధిఖి అంత్యక్రియల కోసం చేస్తోన్న ప్రత్యేక ఏర్పాట్లే మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

ಕಲಬುರ್ಗಿಯಲ್ಲಿ ನಿಧನರಾದ ಶ್ರೀ ಮಹಮದ್ ಹುಸೇನ್ ಸಿದ್ದಿಕಿ, #COVID19 ಶಂಕಿತರೇ ಹೊರತು ದೃಡಪಟ್ಟಿಲ್ಲ. ನಾಗರಿಕರ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ, ಮೃತರ ಅಂತ್ಯಸಂಸ್ಕಾರಕ್ಕಾಗಿ ಕೆಲವೊಂದು ಮುಂಜಾಗ್ರತಾ ಕ್ರಮಗಳನ್ನು ಜಿಲ್ಲಾ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆಯು ಕೈಗೊಂಡಿದೆ. ಇದರಲ್ಲಿ ಯಾವುದೇ ಅನಗತ್ಯ ಗೊಂದಲ, ಭಯ ಸೃಷ್ಟಿಸುವುದು ಬೇಡ #CovidUpdate

— B Sriramulu (@sriramulubjp) March 11, 2020

 

 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

 

Trending News