సోనియాగాంధీ పాత్రలో జర్మన్ నటి..!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్".

Last Updated : Apr 6, 2018, 02:47 PM IST
సోనియాగాంధీ పాత్రలో జర్మన్ నటి..!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్". ఈ చిత్రంలో జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్ సోనియా గాంధీ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సుజేన్ తన ట్విటర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ పోస్టు చేశారు. అందులో ఆమె అచ్చం సోనియా గాంధీలా కనిపించడం విశేషం.

గతంలో కూడా సుజేన్ సోనియా గాంధీ పాత్రలో ఓ టీవీ సీరియల్‌లో నటించారు. "ప్రధానమంత్రి" పేరుతో ఆ సీరియల్ రూపుదిద్దుకుంది. సుజేన్ పలు హిందీ చిత్రాలలో కూడా నటించారు. అలాగే ఆమె హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషలను చాలా చక్కగా మాట్లాడగలరు. సుజేన్ ఓ భారతీయుడినే వివాహం చేసుకున్నారు. ఆయన పేరు అఖిల్ మిశ్రా. అఖిల్ కూడా పలు చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" చిత్రం షూటింగ్ లండన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" సినిమాలో అనుపమ్ ఖేర్, మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" సినిమాకి విజయ్ రత్నాకర్ గట్టే దర్శకత్వం వహిస్తుండగా.. బోహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు. హన్సల్ మెహతా కథా సహకారం అందించిన ఈ చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్" అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. 

 

Trending News