రూ. 1,799 కే స్మార్ట్ ఫోన్.. ఇది సాధ్యమా..!

రూ. 1,799 కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని అంటున్నారు స్వైప్ కంపెనీ నిర్వాహకులు. ఇది సాధ్యమేనని అనుకుంటున్నారా.. అయితే అవుననే అంటున్నారు వారు.

Last Updated : Mar 10, 2018, 10:05 PM IST
రూ. 1,799 కే స్మార్ట్ ఫోన్.. ఇది సాధ్యమా..!

రూ. 1,799 కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని అంటున్నారు స్వైప్ కంపెనీ నిర్వాహకులు. ఇది సాధ్యమేనని అనుకుంటున్నారా.. అయితే అవుననే అంటున్నారు వారు. మార్కెట్ ధర ఈ స్మార్ట్ ఫోనుకి రూ.3,999 రూపాయలు ఉండగా.. ఈ ఫోన్ కొనేటప్పడు జియో సిమ్ తీసుకుంటే.. రూ.2,200 క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్నారు. జియో ఫుట్ బాల్ ఆఫర్ క్రింద, స్వైప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఆఫర్ తీసుకొస్తోంది.

5 అంగుళాల డిస్ప్లేతో పాటు 1280 x 720 పిక్సల్స్ హెచ్‌డీ రిజల్యూషన్ కలిగి ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకత. అదే విధంగా 1 జీబీ ర్యామ్, 8 జీబీ  స్టోరేజ్‌తో పాటు 3,000 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీ కూడా ఈ ఫోన్ అందిస్తోంది. అలాగే డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు 8 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్‌తో 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్ అందిస్తోంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జియో.. ఆ ఆఫర్‌లో క్యాష్ బ్యాక్‌ని వెంటనే ఇవ్వదు. రూ.198 లేదా రూ.299 నెలవారీ ప్లాన్ తీసుకుంటే.. రూ.2,200 రూపాయలను 44 నెలల పాటు రూ.50 ఓచర్ల చొప్పున ఉచితంగా ఇస్తోంది. 

Trending News