Tamilnadu Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, రంగంలో దిగిన వైమానిక బృందాలు

Tamilnadu Heavy Rains: మిచౌంగ్ బీభత్సం నుంచి తేరుకోకుండానే తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అకాల భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు జిల్లాలు అతలాకుతలమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2023, 10:29 AM IST
Tamilnadu Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు, రంగంలో దిగిన వైమానిక బృందాలు

Tamilnadu Heavy Rains: తమిళనాడులో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకశ్మిక వర్షాలతో వరద ముంచెత్తింది. దక్షిణ తమిళనాడులోని కన్యా కుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి, తూత్తుకూడి జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా మారడంతో సహాయక చర్యలకై వైమానిక బృందాలు రంగంలో దిగాయి.

భారీ వర్షాలు దక్షిణ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకూడి, టెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాల్లో పలు గ్రామలు, పట్టణాలు, రహదారులు నీటమునిగాయి. రోడ్లన్నీ చెరువులు, నదుల్ని తలపిస్తున్నాయి. తూత్తుకూడి, తిరునల్వేలిలో చాలా ప్రాంతాల్లో 4-5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుందంటే వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. దక్షిణ తమిళనాడులోని 39 ప్రాంతాల్లో గత 24 గంటల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో కూడా అతి భారీ వర్షాల హెచ్చరిక ఉంది. ఇప్పటి కన్యూ కుమారి, తిరునల్వేలి, టెన్‌కాశి జిల్లాల్లో విద్యాసంస్థలకు రెండ్రోజుల్నించి సెలవులు ప్రకటించారు. అన్నా యూనివర్శిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోడ్లపై 4-5 అడుగుల నీరు ప్రవహిస్తుండటంతో చాలామంది ఇంటి పైకప్పుల్ని ఆశ్రయించారు.

Tamilnadu Rains

తిరునల్వేలి జిల్లా కరుప్పంతురై ప్రాంతంలో వరదల కారణంగా ఓ ఇళ్లు కూలిపోయిన వీడియో వైరల్ అవుతోంది. ప్రజల్ని ఆదుకునేందుకు వైమానిక దళం రంగంలో దిగింది. ఎంఐ 17 వి5 హెలీకాప్టర్ ద్వారా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 7,500 మందిని సురక్షితంగా తరలించినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వరద బాధితుల్ని 84 ప్రత్యేక శిబిరాలకు తరలించారు. అకాల వర్షాలు ఇంత పెద్దఎత్తున విరుచుకుపడటం గతంలో ఎన్నడూ లేదంటున్నారు. చాలా ప్రాంతాల్లో రైల్వే పట్టాలు కొట్టుకుపోవడంతో పలు రైళ్లు రద్దయ్యాయి.

Tamilnadu Rains

గత 12-14 గంటల వ్యవధిలోనే మణిముత్తర్, తిరుచెందూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏకంగా 50 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. కేవలం 12 గంటల్లో ఇంతటి భారీ వర్షం కురవడం ఇటీవలికాలంలో ఎన్నడూ లేదంటున్నారు.

Tamilnadu Rains

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News