Telangana Lok Sabha Polls: తెలంగాణలో ముగిసిన లోక్ సభ నామినేషన్ల పర్వం.. మొత్తం అభ్యర్దుల సంఖ్య ఎంతంటే.. ?

Telangana Lok Sabha Polls: తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 97 లోక్ సభ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో ఎంత మంది అభ్యర్దులు బరిలో ఉన్నారంటే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 30, 2024, 08:45 AM IST
Telangana Lok Sabha Polls: తెలంగాణలో ముగిసిన లోక్ సభ నామినేషన్ల పర్వం.. మొత్తం అభ్యర్దుల సంఖ్య ఎంతంటే.. ?

Telangana Lok Sabha Polls:  దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు 191 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నాల్గో విడతలో భాగంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 97 లోక్ సభ స్థానాలకు నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో పోటీ చేసే అభ్యర్దులు ఎవరనేది తేలిపోయింది. సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా 45 మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి 12 మంది పోటీలో ఉన్నారు.  ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి సహా వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్దులు కలిపి 893 మంది నామినేషన్లు దాఖలు చేసారు. వాటిలో 625 మంది అభ్యర్దుల నామినేషన్లకు ఈసీ ఓకే చేసింది. ఇక నిన్న దాదాపు 100 మంది అభ్యర్దులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో 525 మంది బరిలో ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

ఇక సికింద్రాబాద్ నుంచి అత్యధికంగా.. 45 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత మెదక్ నుంచి 44 మంది..  చేవెళ్ల నుంచి 43 మంది బరిలో ఉన్నారు.  పెద్దపల్లి నుంచి 42 మంది పోటీలో ఉన్నారు. అటు కరీంనగర్ నుంచి 28.. నిజామాబాద్ నుంచి 29.. మహబూబ్ నగర్ నుంచి 31, నాగర్ కర్నూల్ నుంచి 19.. నల్గొండ నుంచి 22.. భువనగిరి నుంచి.. 39.. వరంగల్.. 40.. మహబూబాబాద్ నుంచి 23 మంది.. ఖమ్మం నుంచి 35 మంది.. హైదరాబాద్ లోక్ సభ సీటు నుంచి 30.. మల్కాజ్‌గిరి.. 22.. మెదక్.. జహీరాబాద్ నుంచి 19.. ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 12 మంది బరిలో ఉన్నారు.

17 లోక్ సభ సీట్లలో ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు.. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి.  

ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 9 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు. .ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు.. జార్ఘండ్‌లోని 4 లోక్ సభ సీట్లు.. మొత్తంగా మే 13న  9 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శ్రీనగర్‌కు ఎన్నికలకు జరనున్నాయి.  మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4న 543 స్థానాలకు  కౌంటింగ్ నిర్వహిస్తారు.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News