హోటల్ గదిలో నటి అనుమానాస్పద మృతి!

హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో కనిపించిన నటి మృతదేహం!

Last Updated : Sep 7, 2018, 01:42 PM IST
హోటల్ గదిలో నటి అనుమానాస్పద మృతి!

ప్రముఖ బెంగాలీ టీవీ నటి పాయెల్‌ చక్రవర్తి (38) పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం మధ్యాహ్నం హోటల్‌లో ఓ గది తీసుకున్న పాయెల్‌ చక్రవర్తి.. అదే రోజు రాత్రి హోటల్ గదిలో శవమై కనిపించారని సిలిగురి పోలీస్ కమిషనర్ గౌరబ్ లాల్ తెలిపారు. నటి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కి చేరుకుని గదిలో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించిన ఆమె శవాన్ని కిందకి దించి పంచనామా నిర్వహించారు. హోటల్‌లో దిగేముందు తాను బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాల్సి ఉందని, తనను ఎవరు డిస్టర్బ్‌ చేయొద్దన్నాని అన్నారని హోటల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. బుధవారం రాత్రి భోజనం కూడా తీసుకోలేదని హోటల్ సిబ్బంది చెప్పారు. ఈ కారణంగానే తాము ఎంతసేపు ప్రయత్నించినా తలుపు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని హోటల్ సిబ్బంది పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

నటి పాయెల్ చక్రవర్తికి 2 ఏళ్ల కుమారుడు ఉండగా ఇటీవలే ఆమె తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. పాయెల్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సిలిగురి పోలీసులు తెలిపారు. అయితే ఆమెది హత్యా, లేక ఆత్మహత్యానా విషయాలు మాత్రం పూర్తి దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని సిలిగురి పోలీస్ కమిషనర్ గౌరబ్ లాల్ చెప్పారు.

Trending News