బహు భార్యత్వంపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకోవడం రాజ్యంగబద్ధంగా చెల్లుతుందా? అనే విషయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Last Updated : Mar 27, 2018, 02:07 PM IST
బహు భార్యత్వంపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకోవడం రాాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా? అనే విషయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముస్లిం మతంలో నిఖా హలాలా, బహుభార్యత్వం అంశాలపై దాఖలైన పిటీషన్లను కలిపి విచారించే అంశంపై కేంద్రం, న్యాయ కమిషన్‌లను తమ విధానాన్ని స్పష్టం చేయాలంటూ నోటీసులు జారీ చేసింది.

ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండేందుకు బహుభార్యత్వం అనుమతిస్తుంది. ఓ ముస్లిం మహిళ తాను విడాకులు తీసుకున్న భర్తనే తిరిగి వివాహం చేసుకోవాలంటే.. మరో పురుషుడిని పెళ్లి చేసుకొని అతడికి విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తొలుత విడాకులు ఇచ్చిన భర్తను వివాహం చేసుకోవడానికి వీలవుతుంది. ఈ సంప్రదాయాన్నే ‘నిఖా హలాలా’గా పిలుస్తారు.

ఈ రెండు సంప్రదాయాలు సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తున్నాయని.. లింగ సమానత్వానికి ఈ ఆచారాలు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తిచేశారు. వారి పిటిషన్లపై ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.కాగా, గతేడాది 'ట్రిపుల్‌ తలాక్‌' రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంతో ఈ అంశాల్లో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Trending News