Same Sex Marriage: పెళ్లితో ఒక్కటి కానున్న ఇద్దరు మహిళా వైద్యులు... సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో!

Same Sex Marriage: పెళ్లంటే కులాలు, మతాలు, అందం, వయసు, జాతకాలు.. ఇవన్నీ కుదిరితేనే కొంతమంది ముందడుగు వేస్తారు. కానీ కొంత మంది ఇవేం అవసరం లేకుండా.. ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు.. అది కూడా ఇద్దరు ఉన్నత వైద్యులు పెళ్లి చేసుకోటానికి సిద్ధం అయ్యారు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 01:06 PM IST
  • పెళ్లితో ఒక్కటి కానున్న ఇద్దరు మహిళా వైద్యులు
  • నాగపూర్‌కి చెందిన డా.పరోమితా ముఖర్జీ, డా.సుర్భి మిత్రా
  • త్వరలో గోవా పెళ్లి చేసుకోనున్న ఈ ఇద్దరు వైద్యులు
 Same Sex Marriage: పెళ్లితో ఒక్కటి కానున్న ఇద్దరు మహిళా వైద్యులు... సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో!

Same Sex Marriage: మహారాష్ట్రలోని (Maharashtra) నాగపూర్‌కి చెందిన ఇద్దరు మహిళా వైద్యులు పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇటీవలే ఈ ఇద్దరు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే గోవాలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు మహిళా వైద్యుల పెళ్లి నాగపూర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ మహిళా వైద్యుల పేర్లు డా.పరోమితా ముఖర్జీ, డా.సుర్భి మిత్రా. పెళ్లిపై డా.పరోమితా మాట్లాడుతూ... 'నా లైంగిక ధోరణి గురించి నా తండ్రికి 2013 నుంచి తెలుసు. నా తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె షాక్‌కి గురైంది. కానీ ఆ తర్వాత నా ఇష్టాన్ని ఆమె అంగీకరించింది. నేను సంతోషంగా ఉండటమే అమ్మకు ముఖ్యం... అందుకే నా ఇష్టాన్ని స్వాగతించింది.' అని పేర్కొన్నారు.

మరో వైద్యురాలు సుర్భి మిత్రా మాట్లాడుతూ... ఒక మహిళగా మరో మహిళను వివాహం చేసుకునేందుకు తన కుటుంబం నుంచి తనకెలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదని తెలిపారు. నిజానికి వారు చాలా సంతోషించారని పేర్కొన్నారు.

ఒక సైకో థెరపిస్ట్‌గా తాను చాలామందితో మాట్లాడుతుంటానని... ఆ క్రమంలో చాలా సందర్భాల్లో వ్యక్తుల జీవితాల్లోని రెండు కోణాలను గమనించానని తెలిపారు. మనసులో ఒకలా... బయటకు మరోలా జీవించడం సరికాదని.. అందుకే తన మనసుకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నాని తెలిపారు. త్వరలోనే గోవాలో (Goa) పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని... తామిద్దరం జీవితాంతం జంటగా కలిసి బతకాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

Also Read: Man rapes dog: శునకంపై వృద్దుడి లైంగిక దాడి.. సీక్రెట్‌గా వీడియో తీసిన కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News