కేంద్ర బడ్జెట్ 2018పై మార్కెట్ వర్గాల ఫోకస్

కేంద్ర బడ్జెట్ 2018-19 కేంద్రానికి పెను సవాల్ విసురుతోంది.

Last Updated : Feb 1, 2018, 04:31 PM IST
కేంద్ర బడ్జెట్ 2018పై మార్కెట్ వర్గాల ఫోకస్

కేంద్ర బడ్జెట్ 2018-19 కేంద్రానికి పెను సవాల్ విసురుతోంది. ఇంకొద్ది గంటల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2018-19 బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రజల్ని రంజింపచేస్తే సరిపోదు.. అదే సమయంలో దేశంలో పెట్టుబడులకి ఊతమిచ్చే విధంగా వ్యాపారవర్గాలని సైతం మోదీ సర్కార్ సంతృప్తి పర్చాల్సి వుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రొజెక్ట్ చేస్తున్న స్థూల దేశీయ ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రం నిర్ధారించబోయే ద్రవ్య లోటుపైనే ప్రస్తుతం మార్కెట్ వర్గాల దృష్టి అంతా కేంద్రీకృతమై వుంది. వ్యవసాయం, గ్రామీణం లాంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులు పెంచాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో ద్రవ్యలోటు 3.2%గా వుండే అవకాశాలు వున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నట్టుగా ఇటీవల ఓ సర్వే అభిప్రాయపడింది. 

2014 తర్వాత మోదీ రాకతో మార్కెట్‌లోనూ మార్పు వస్తుందని వ్యాపారవర్గాలు ఆశించాయి. అందుకు తగినట్టుగానే పెట్టుబడులు పెంచే, ఆకర్షించే దిశగా కేంద్రం చేయాల్సిన కసరత్తులన్నీ చేస్తోంది. ఏదేమైనా రేపటి నుంచి మార్కెట్‌లో ఏయే షేర్లు కుప్పకూలనున్నాయి, ఏయే షేర్లు పైకి ఎగబాకనున్నాయి అనేది కేవలం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే ఆధారపడి వుంటుందనేది నిపుణులు చెబుతున్న మాట. 

Trending News