Wife Cigarette Torture: శాడిస్ట్ భార్య పైశాచీకం.. భర్తను సిగరేట్లతో కాలుస్తూ, మంచానికి కట్టేసీ..వీడియో వైరల్..

Bijnor wife Torture: మహిళ శాడిస్ట్ గా మారింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెడదామని భర్తకు చెప్పింది. భార్య పోరు పడలేక అతగాడు వేరేచోటకు షిఫ్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ చేసింది. ప్రతిరోజు భర్తకు చుక్కలు చూపించేది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2024, 03:13 PM IST
  • వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన..
  • భర్త మర్మాంగాలపై సిగరేట్ కాల్చిన భార్య..
Wife Cigarette Torture: శాడిస్ట్ భార్య పైశాచీకం..  భర్తను సిగరేట్లతో కాలుస్తూ, మంచానికి కట్టేసీ..వీడియో వైరల్..

Wife Inflicts cigarette burns on husband private parts in bijnor uttar pradesh: చాలా వరకు క్రైమ్ స్టోరీలలో పెళ్లాయ్యాక భర్తలు తమ భార్యలను వేధించడం చూస్తుంటాం. కట్నంతేలేదని, భార్య అందంగా లేదని భర్తలు వేధిస్తుంటారు. మరికొందరు భార్యకు వండటం రాలేదని, కూరలో ఉప్పు తక్కువగా వేసిందని శాడిజం చూపిస్తుంటారు. అంతేకాకుండా.. భార్యపట్ల అనుమానంతో ఉంటారు. ఎవరితో మాట్లాడిన, ఏంపనిచేసిన కూడా వేధిస్తుంటారు. భార్య ఆఫీసుకు వెళ్లి, ఇంట్లో వాళ్లతో మాట్లాడిన కూడా అనుమానంతో ఉంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. భర్తలే ఎందుకు వేధించాలి.. భార్యలు ఎందుకు టార్చర్ చేయకూడదని అనుకున్నారో.. ఏంటో కానీ.. కొందరు మహిళలు తమ భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు.

 

పెళ్లాయ్యాక  కూడా లవర్స్ తో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఒకవేళ భర్త అడ్డువస్తే అతడిని చంపడానికి సైతం వెనుకాడటం లేదు. భర్త ఏమన్నా అంటే వేధింపుల కేసుపెడతామంటూ రివర్స్ లో దాడులు చేస్తున్నారు. భర్తలను రాత్రిపూట వేధింపులుకు గురిచేస్తు టార్చర్ పెడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మెహర్ జహాన్, మనన్ జైదీలకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత నుంచి భార్యవేరుగా కాపురం ఉందామంటూ భర్తకు టార్చర్ చూపించింది. దీంతో భార్య పొరుపడలేక, మరో చోటికి వెళ్లిపోయారు. ఈక్రమంలో .. మెహార్ జహన్ అప్పటి నుంచి భర్తకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ప్రతిరోజు రాత్రి సిగరేట్ లు తాగి,భర్తను వేధించేది. ఏమన్నా అంటూ రివర్స్ లో కేసు పెడుతానంటూ ఇబ్బందులకు గురిచేసేంది. అంతేకాకుండా.. భర్తకు మత్తుపదార్థం కల్పిన పానీయం తాగించేది. అతను నిద్రలోకి జారుకున్నాక.. అతని కాళ్లు చేతులను కట్టేసీ, సిగరేట్ లో తాగి, అతని ప్రైవేటు పార్ట్ లకు చురకలు పెట్టేది. ఒళ్లంతా సిగరేట్ తో వాతలు పెట్టేది. భార్య వేధింపులు భరించలేక అనేక సార్లు కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ అతని మాటలు ఎవరు పట్టించుకోలేదు. చివరకు ఒక రోజు గదిలో వీడియో పెట్టాడు. ఆ రోజు రాత్రి రోజులాగే.. మెహార్ జహాన్ రెచ్చిపోయింది.

Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

భర్తను మత్తు కల్పిన ఆహారం ఇచ్చి , అతని కాళ్లు చేతులు కట్టేసి, అతనిపై ఎక్కి కూర్చుంది. అంతేకాకుండా సిగరేట్ తాగుతూ, అతని ప్రైవేటు పార్ట్ లకు వాతాలు పెట్టింది. ఈ ఘటన అంతా అక్కడి ఫోన్ లో రికార్డు అయ్యింది. ఉదయం లేచాక..మనన్ జైదీ ఫోన్ లోని రికార్డు అయిన వీడియోను పోలీసులకు ఇచ్చి తన ప్రాణాలు కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శాడిస్టు భార్యను అదుపులోకి తీసుకున్నారు. భార్య వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, అతని అడ్డు తొలగించుకునేందుకు,ఇలా శాడిజం పనులు చేసిందని భర్త కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News