Wipro Recruitment : విప్రోలో జాబ్స్.. శాలరీ, అర్హత, తదితర వివరాలు ఇదిగో!

Wipro Jobs 2022 full details : విప్రోలో ఉద్యోగ అవకాశాలు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0 కింద జాబ్స్. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. పూర్తి వివరాలు...

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 09:30 PM IST
  • విప్రో ఉద్యోగ అవకాశాలు
  • బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
  • పూర్తి వివరాలు ఇదిగో...
Wipro Recruitment : విప్రోలో జాబ్స్.. శాలరీ, అర్హత, తదితర వివరాలు ఇదిగో!

Wipro Recruitment 2022 Apply process, last date, salary, eligibility details : భారత టెక్‌ దిగ్గజం విప్రో (Wipro) 'వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0' (Work Integrated Learning Program 2.0) కింద బీసీఏ (BCA) బీఎస్సీ (B.Sc) గ్రాడ్యుయేట్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యా అర్హతలు : (Educational requirements)
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (Bachelor of Computer Application) (బీసీఏ) - BCA
లేదా
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (Bachelor of Science) (బీఎస్సీ) - B.Sc. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, (Computer Science) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ వంటి స్ట్రీమ్‌లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

ఇతర వివరాలు:
గ్రాడ్యుయేషన్‌లో కోర్ మ్యాథమెటిక్స్ (Core Mathematics) ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ కోర్ మ్యాథమెటిక్స్‌గా పరిగణలోకి తీసుకోరు. ఇక 10వ తరగతి, గ్రాడ్యుయేషన్‌కు మధ్య గరిష్ఠంగా 3 సంవత్సరాల ఎడ్యుకేషన్ గ్యాప్ (3 years of education gap) ఉండొచ్చు.

ఇక గ్రాడ్యుయేషన్‌లో గ్యాప్స్‌ ఉంటే అనర్హులు. గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాలలో పూర్తి చేసి ఉండాలి. భారత కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో పది, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి ఉండాలి. విద్యా విధానం అంతా రెగ్యులర్, ఫుల్ మోడ్‌లోనే జరిగి ఉండాలి. ఇక ఇంటర్వ్యూ స్టేజ్‌ వరకు అన్ని బ్యాక్‌లాగ్‌లు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 7, 2022. ( February 7, 2022) ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ.23,000 స్టైఫండ్ (stipend) లభిస్తుంది.

Also Read : Lockdown in India: సంక్రాంతి తర్వాత దేశంలో మరోసారి లాక్ డౌన్!- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఎంపిక ప్రక్రియ: (Selection process)
ఆన్‌లైన్ అసెస్‌మెంట్ (Online Assessment) -(80 నిమిషాలు)
ఆప్టిట్యూడ్ టెస్ట్ - వెర్బల్, ఎనలిటికల్, క్వాంటిటేటివ్ (ప్రతి విభాగంలో 20 నిమిషాలు/ 20 ప్రశ్నలు ఉంటాయి)
రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ - (20 నిమిషాలు). ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో ఎంపికైన తర్వాత, అభ్యర్థులు బిజినెస్ డిస్కషన్ రౌండ్‌లో (Business Discussion Round) పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అన్ని అర్హతలు ఉండి ఆసక్తి గల అభ్యర్థులు (careers.wipro.com/wilp) లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read : Telangana corona Cases: తెలంగాణలో కొత్తగా 1825 కరోనా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News