ప్రధాన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 68వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

Last Updated : Sep 17, 2018, 04:27 PM IST
ప్రధాన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 68వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇవాళ 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోదీకి ఉదయం నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. యావత్ భారతదేశం శుభాకాంక్షలు తెలుపుతోంది. కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజానీకం ఇలా అందరూ.. సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వేడుకల్లో భాగంగా, ఇవాళ ప్రధానమంత్రి తన నియోజకవర్గం వారణాసికి వెళ్తున్నారు. అక్కడ పాఠశాల విద్యార్థులతో జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. తన 68వ జన్మదిన రోజున ప్రధాన మంత్రి మోదీ వారణాసిలో  'ఛలో జీతే హై' అనే 32 నిమిషాల చలనచిత్రాన్ని స్కూల్ విద్యార్థులతో కలిసి వీక్షిస్తారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ సీఎం అర్వింద్ క్రేజీవాల్, గోవా సీఎం మనోహర్ పారికర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పార్టీ నేతలు తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

Trending News