ఇల్లందులో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా..? సందేహంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు

ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ నవంబర్ 1 వ తేదీన ఇల్లందులో జరగనున్న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొనసాగుతున్న కొన్ని పరిస్థితుల వలన అక్కడ సభ సక్సెస్ కాకపోవచ్చు అని స్థానికులు అనుకుంటున్నారు. ఆ వివరాలు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2023, 03:34 PM IST
ఇల్లందులో కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందా..? సందేహంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు

ఇల్లందులో ఒకటవ తేదీన జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ అవుతుందా..? లేదా..? అన్న సందేహం ఇల్లందు ప్రజల్లో, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల మదిలో నెలకొంది. బి ఆర్ ఎస్ నేతలు , ప్రజా ప్రతినిధుల మధ్య నెలకొన్న అనైక్యతే సీఎం కేసీఆర్ సభ విజయవంతం జరగదు అనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం హరిప్రియ భర్త హరి సింగే అని సొంత పార్టీ కార్యకర్తలే ప్రజల్లో ఓపెన్ గా చెబుతున్నారు. అసమతి నేతలను బుజ్జగించడంలో అగ్ర నేతలు వైఫల్యం చెందారంటే పార్టీకి ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చాంటూ గుసగుసలాడుకుంటున్నారు

ఇటీవల హరిప్రియ గ్రామాలలో ఇంటింటి ప్రచారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే పథకాలు కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజాప్రతినిధుల తీరుతో ఇల్లందులో బిఆర్ఎస్ పార్టీ కి రోజురోజుకు ఆదరణ కరువు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక జనం కొత్త అభ్యర్థిని కోరుకుంటున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఇటీవల బయ్యారంలోని సింగారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియకు ప్రజల మంచి నిరసన సెగ తగిలింది . దీంతో ఆమె ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి వెను దిరిగారు.  

ఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇల్లందులో బిఆర్ఎస్ దుస్థితి అద్వానంగా తయారు అయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒకపక్క అసమ్మతి నేతల తిరుగుబాటుకు తోడు ప్రచార నిమిత్తం ప్రజల్లోకి వెళితే ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగులుతుంది .ఎక్కడికి వెళ్లినా గ్రామాల్లో జనం అడ్డుకునేందుకు సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా హరిప్రియకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే తమ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో గ్రామానికి ఏమి చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

ప్రధానంగా కామేపల్లి, బయ్యారం, టేకులపల్లి మండలాల్లో  ఎమ్మెల్యే హరిప్రియకు ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ సీనియర్ నాయకులే అంటున్నారు . నిన్న మొన్నటి వరకు ఏజెన్సీలోని పల్లెలో బి ఆర్ఎస్ కు మొదలైన వ్యతిరేకత ఇల్లందు మున్సిపాలిటీలోనూ షురూ అయింది. ఇల్లందులోని బిఆర్ఎస్ అసమ్మతి నేతలు ఎట్టి పరిస్థితుల్లో హరిప్రియకు బీఫాం ఇవ్వద్దంటూ పట్టుబట్టిన విషయం అందరికీ తెలిసిందే. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్ ,ఎంపీ కవిత ఎన్నికల ఇంచార్జ్ వద్ది రవిచంద్ర, పువ్వాడ అజయ్ తోపాటు పలువురిని అసమతి నేతలు కలిసి తమ నిరసన  తెలిపారు. 

Also Read: Vishwak Sen : ప్రభాస్ ముందు విశ్వక్ సేన్ వంటి యువ హీరో నిలబడగలడా?

హరిప్రియకు టికెట్ ఇవ్వడం వారికి ఎంత మేరకు ఇష్టం లేదు. పార్టీకి కట్టుబడి ఉండాలంటే హరిప్రియకు బి ఫాం ఇవ్వద్దంటూ ఆందోళనకు దిగారు. మంత్రులు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసిన ఏకంగా అసమ్మతి నేతలు ఏకంగా సమావేశం కావడం విశేషం. గార్ల, బయ్యారంతోపాటు ఇల్లందు పట్టణంలో ఇప్పటికే కీలక నేతల సమావేశం అయ్యారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను ధిక్కరించి హరిప్రియకు బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని బహిరంగంగా చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని బట్టి చూస్తే ఇల్లందులో బిఆర్ఎస్ ఓటమి ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. బిఆర్ఎస్ నేతలే ఓటమి కోరుకుంటున్నారంటే పార్టీ ఓటమికి ఇంతకంటే కారణం మరొకటి ఉండదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నాను.

ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాల్లో పార్టీలోని వర్గ విబేధాలు బహిర్గతం అయ్యాయి. హరిప్రియ సాక్షిగా ప్రజాప్రతినిధుల బాహాబాహీకి దిగారు. జెకె కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దసరా ఉత్సవాలలో హరిప్రియ అసమతి వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటాపోటీగా దూషించుకున్నారు. ఒకానొక సందర్భంలో దాడి చేసుకునే స్థితికి   దిగజారారు. వీరి వ్యవహార శైలి చూసి అక్కడి ప్రజలు నవ్వుకున్నారు. గ్రంథాలయ శాఖ జిల్లా చైర్మన్ దిండిగల రాజేందర్ ,మున్సిపల్ చైర్మన్ దమ్ములపాటి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ జోక్యం చేసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఒకవైపు డివి వర్గం మరోవైపు దిండిగల వర్గం పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు అంటే టిఆర్ఎస్ నేతల ప్రజా ప్రతినిధుల మధ్య ఐక్యత ఎంత మేరకు ఉందో ఇట్టి అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ చైర్మన్ డివి దిండి గల రాజేందర్ కట్టప్పగా వర్ణించారు. ఆయన వెంట ఉంటే మేము పని చేయమంటూ పరోక్షకంగా తెలిపారు. అదే విధంగా రాజేందర్ విలేకరుల సమావేశం పెట్టి ఉత్సవ కమిటీ ప్రశ్నించారు. 

మున్సిపల్ పాలకవర్గం అయితే ప్రోటోకాల్ ఉంటుంది ఉత్సవ కమిటీ ఏర్పాటు పాటు చేసిన ఉత్సవాలలో డివి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం చినికి చినికి గాలి వానల మారిన హరిప్రియ ఎవరికి సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంది . జరుగుతున్న పరిణామాలను  చూస్తే పార్టీ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది .రాను రాను అసమతి వర్గం ఒకపక్క గ్రూపులు ఆరోపణలు చేసుకుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బిఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆ పార్టీలోని అసమ్మతి నేతలు  చెబుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా .ఎక్కడికి అక్కడికి రహస్య సమావేశాలు పెట్టి హరి ప్రియ ఓటమి కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల బయ్యారం మండలంలో పదుల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు ఐక్యంగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే . ఇక టేకులపల్లి, కామేపల్లి, ఇల్లందు మండలం పట్టణంలో ఇదే పరిస్థితి కనపడితే బి ఆర్ ఎస్ పరిస్థితి ఏమిటని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ నేతల ప్రజాప్రతినమధ్య అనైక్యతే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి గెలుపుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం కేసీఆర్ సభ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Also Read: Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ, ఊరట లభించేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News