Rice Bugs: బియ్యం పురుగు పట్టకుండా ఏడాదిపాటైనా నిల్వ ఉండాలంటే.. ఈ ఒక్క వస్తువు అందులో వేయండి..

Rice Storing Tips:  సాధారణంగా మనం వంట గది రైస్ డబ్బాలో బియ్యం నిల్వ చేసుకుంటూ ఉంటాం ఇందులో తెల్ల పురుగులు, నల్లపురుగులు వచ్చి మనకు చికాకు తెప్పిస్తాయి. కొన్ని హోమ్ రెమెడీలు పాటిస్తే ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఏడాది మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు

Written by - Renuka Godugu | Last Updated : Mar 14, 2024, 04:29 PM IST
Rice Bugs: బియ్యం పురుగు పట్టకుండా ఏడాదిపాటైనా నిల్వ ఉండాలంటే.. ఈ ఒక్క వస్తువు అందులో వేయండి..

Rice Storing Tips:  సాధారణంగా మనం వంట గది రైస్ డబ్బాలో బియ్యం నిల్వ చేసుకుంటూ ఉంటాం ఇందులో తెల్ల పురుగులు, నల్లపురుగులు వచ్చి మనకు చికాకు తెప్పిస్తాయి. కొన్ని హోమ్ రెమెడీలు పాటిస్తే ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఏడాది మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు  ఇలా చేయడం వల్ల పురుగు పట్టిన బియ్యం కూడా వదిలి పోతాయ

ఎండు మిరపకాయలు...
బియ్యం పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవడానికి ఎండుమిరపకాయలు మంచి రెమిడీ. బియ్యం డబ్బాలో ఒక లేయర్ రైస్ వేసి ఎండుమిర్చి వేయాలి. మరో లేయర్ రైస్ వేసి ఎండుమిర్చి వేసుకుంటూ ఇలా చివరిగా లాస్ట్ లో వచ్చేసరికి ఒక న్యూస్ పేపర్ పెట్టి బియ్యండబ్బా ను గాలి చొరబడకుండా మూత పెట్టి నిల్వ చేయాలి . ఇలా చేయడం వల్ల ఎండుమిర్చి ఘాటుకు పురుగు పట్టకుండా ఉంటుంది బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉంటుంది

వేపాకు..
బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి వేపాకు బెస్ట్ రెమిడీ. ఇది మన అమ్మమ్మల కాలంనాటి నుంచే పాటిస్తారు దీనికి ముందుతగా వేపాకు నీడలోనే ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని కవర్లో వేసుకుని బియ్యం డబ్బాలో నిల్వ చేసుకోవాలి ఇందులో పెట్టేముందు టూత్ పిక్స్ తో కవర్ కి రంద్రాలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ వేప ఘాటుకి బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. ఒకవేళ నేరుగా వేపాకులు పెట్టుకుంటే అవి ఎండిపోయి పొడిగా మారి బియ్యంలో కలిసిపోతాయి. కాటన్ గుడ్డలో కూడా ఇలా వేపాకులను వేసి మూడేసి బియ్యం డబ్బాలో వేసి పెట్టాలి అంతేకాదు బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలో గాలి చొరబడకుండా జాగ్రత్త వహించాలి

ఇదీ చదవండి: డెకరేషన్ కోసం పెంచే ఈ మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
వెల్లుల్లి...
బియ్యం ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడానికి మరో అద్భుతమైన రెమిడీ వెల్లుల్లి. వీటిని బియ్యం డబ్బాలో అక్కడక్కడ వేసి పెట్టాలి వీటి ఘాటుకి బియ్యం లో పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా లేయర్లలో వెల్లుల్లి వేసి చివరగా మళ్లీ న్యూస్ పేపర్ పెట్టి మూత టైట్ గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పురుగుపట్టకుండా ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటుంది.

మిశ్రమం..
బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి కొన్ని వేపాకులు వెల్లుల్లిపొట్టు లవంగాలు, మిరియాలు కలిపి కొన్ని నీళ్లు పోసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్నబిళ్లల మాదిరి వత్తుకోవాలి. వీటిని రెండు రోజులపాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి బియ్యండబ్బాలో అక్కడక్కడ వేసి పెడితే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

ఇదీ చదవండి: ఈ 5 కూరగాయలు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి.. ఈరోజే మీ డైట్లో చేర్చుకోండి..

లవంగం..
లవంగం, మిరియాలు రెండిటిని చిన్న మూటలుగా కట్టి బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలో పెట్టుకోవాలి. ఒక కిలో బియ్యం వేసి దాని తర్వాత ఈ మూట పెట్టి మరో లేయర్ కిలో బియ్యం వేసి ఈ మూట పెట్టుకుంటూ రావాలి చివరగా బియ్యం డబ్బాకు గాలిచొరబడకుండా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఏడాదిపాటైన బియ్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News