Cool House Tips::వేసవికాలంలో కూడా ఇల్లు చల్లగా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Summer Tips: ఎండాకాలం ఇంట్లో వేడి పెరిగిపోతుంది. ఈ వేడి వాతావరణం మనలో చాలామందికి అస్సలు పడదు. అలాగని పొద్దున్నుంచి ఏసీలు వేసుకోలేము కదా.. మరి ఎండాకాలం కూడా ఇంటిని చల్లగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2024, 09:20 AM IST
Cool House Tips::వేసవికాలంలో కూడా ఇల్లు చల్లగా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Summer Home tips: వేసవికాలం మొదలు కావడంతో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మరి మే వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎండలు తట్టుకోవడం చాలామంది వల్ల కాదు. అలాగని పొద్దుట నుంచి ఇంట్లో ఏసీలు వేసుకొని కూర్చోలేము కదా. ఏసీ వల్ల కరెంటు బిల్లు పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు ఎండాకాలంలో కూడా ఎంతో కొంత చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.

ఇల్లు సహజంగా చల్లగా ఉండాలి అంటే ముందు ఇంట్లో కొన్ని వస్తువులను మనం మార్చాల్సి ఉంటుంది. మీరు బల్బులు వాడుతున్నట్లయితే ముందుగా వాటి అన్నిటిని ఎల్ఈడి బల్బులతో మార్చుకోండి. ఇంట్లో ఎల్ఈడి లైట్లు పెట్టుకోవడం వల్ల కరెంట్ ఆదా అవ్వడమే తో పాటు ఇంటి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. వేసవికాలం శరీరానికి గాలి తగిలే విధంగా కాస్త వాదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సహజంగా మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

గదిలో ఒక మూల పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు రూమ్ తెలియకుండానే చల్లబడుతుంది. సీలింగ్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువగా టేబుల్ ఫ్యాన్స్ వాడడం మంచిది. ఫ్రిజ్లో నీళ్ల కంటే కూడా కుండలోని చల్లటి నీళ్లు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడప్పుడు శుభ్రమైన వస్త్రాన్ని చల్లటి నీటిలో పిండి ముఖం తుడుచుకుంటూ ఉండండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది.

ఏసీ వాడాలి అనుకున్న వాళ్లు కచ్చితంగా 24 నుంచి 27 సెంటీగ్రేడ్ల మధ్య మాత్రమే ఉష్ణోగ్రత ఉండేలా సెట్ చేసుకోండి. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత లో ఏసీ పెట్టుకోవడం వల్ల శరీరానికి అనారోగ్యపరమైన సమస్యలు కలుగుతాయి. మీ ఇంటి చుట్టూ , కిటికీలు, ద్వారాల దగ్గర పూల కుండీలు పెట్టడానికి చూడండి. ఇది వేడిని గ్రహించి సహజంగానే చల్లదనాన్ని అందిస్తాయి. తరచూ నీళ్లు తాగడం, చల్లని పండ్లు ,కాయగూరలు తీసుకోవడం, మజ్జిగ తాగడం, ఎక్కువ మసాలా లేని కూరలు తినడం. ఈ సీజన్ లో తప్పనిసరి. బయటకు వెళ్లే సమయంలో ఒక గ్లాస్ నీరు తాగి వెళ్లడం మర్చిపోకండి. చక్కెర పానీయాలు అధిక మోతాదులో తీసుకోవద్దు.. ఇది శరీరాన్ని మరింత డిహైడ్రేట్ చేస్తాయి. ఈ చిన్ని పాటి జాగ్రత్త తో సమ్మర్ సీజన్ లో వేడి మిమ్మల్ని వేధించదు.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News