Multibagger Stocks: షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని షేర్లు అమాంతం లాభాలు కురిపిస్తాయి. కొన్ని మీ సహనాన్ని పరీక్షిస్తాయి. మరి కొన్ని ఉన్నట్టుంది కుప్పకూలిపోతుంటాయి., అందుకే షేర్ మార్కెట్‌లో అవగాహనతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. అప్పుడు రాణించగలరు. కేవలం రెండేళ్ల కాల వ్యవధిలో 3300 శాతం వృద్ధి సాధించిన పెన్నీ స్టాక్ గురించి పరిశీలిద్దాం..
ఇది 2023 సంవత్సరంలో అద్భుతమైన లాభాల్ని ఇచ్చిన షేర్. సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ షేర్ ఇది. మల్టీబ్యాగర్ స్టాక్‌గా పెన్నీ స్టాక్‌గా ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు అందించింది. ఏడాది కాల వ్యవధిలో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేసింది. ఏడాది క్రితం 2.5 రూపాయలుగా ఉన్న ఈ కంపెనీ షేర్ విలువ కేవలం 12 నెలల్లో 86 రూపాయలకు చేరింది. అంటే అప్పట్లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇప్పుడది 5.3 లక్షల రూపాయలకు చేరుకునేది. అదే 2 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడది 34 లక్షల రూపాయలయ్యేది.
ఈ నెలలో కూడా సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కంపెనీ స్టాక్ విలువ 83 నుంచి 86 రూపాయలకు పెరిగింది. ఆరు నెలల వ్యవధిలో ఈ కంపెనీ షేర్ విలువ 20.65 రూపాయల్నించి 86 రూపాయలకు చేరింది. అంటే 300 శాతం రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఓ ఒప్పందం ప్రకారం 300 కోట్లతో ఈవీ ఛార్జర్స్ తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈవీ కార్ల మార్కెట్ పెరుగుతున్న క్రమంలో సర్వోటెక్ కంపెనీ కుదుర్చుకున్న ఈ ఒప్పందమే ఆ కంపెనీని లాభాలబాట పట్టిస్తుందని అర్ధమౌతోంది.
కేవలం ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు అందించిన పెన్నీ స్టాక్ ఇది. ఈ కంపెనీ ఐపీవో ప్రారంభమైనప్పుడు ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో ఈ షేర్ అద్భుతమైన లాభాలు సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అప్పుడు పెట్టుబడి పెట్టకుండా మిస్ అయినవాళ్లు ఇప్పుడు చింతిస్తుండవచ్చు. కానీ పెన్నీ స్టాక్స్ ఇలానే ఉంటాయి. లాభాలైనా ఇస్తాయి లేదా నష్టాలైనా కల్గిస్తాయి.
Also read: Toyota Rumion: త్వరలో టొయోటా నుంచి రుమియన్ లాంచ్, ఎర్టిగాను వెనక్కి నెట్టేస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook