నారాయణ మూర్తి బయోపిక్.. ఆసక్తికరమైన అంశాలతో స్కిప్ట్!

నారాయణ మూర్తి... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులుగా ప్రముఖ వ్యాపార దిగ్గజం నారాయణ మూర్తి పేరు తెలియని వారుండరు. చిన్న వ్యాపారంతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణ మూర్తి ఆ తర్వాత అంచలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పెద్ద వ్యాపార దిగ్గజంగా ఎదిగిన సంగతి తెలిసిందే. 

Last Updated : Jan 18, 2019, 12:26 PM IST
నారాయణ మూర్తి బయోపిక్.. ఆసక్తికరమైన అంశాలతో స్కిప్ట్!

నారాయణ మూర్తి... ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులుగా ప్రముఖ వ్యాపార దిగ్గజం నారాయణ మూర్తి పేరు తెలియని వారుండరు. తన భార్య సుధా నారాయణ మూర్తి వద్ద రూ.10,000 మొత్తాన్ని రుణంగా తీసుకుని చిన్న వ్యాపారంతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణ మూర్తి ఆ తర్వాత అంచలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పెద్ద వ్యాపార దిగ్గజంగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సంస్థను అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దడం వెనుక నారాయణ మూర్తి చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ విశేషాలన్నింటినీ ప్రస్తావిస్తూ ప్రముఖ ఫిలింమేకర్ సంజయ్ త్రిపాఠి ఓ బయోపిక్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. 

ఎనిమిది నెలల క్రితమే నారాయణ మూర్తి కలిసిన సంజయ్ త్రిపాఠి ఆయనను అతికష్టమ్మీద ఈ బయోపిక్‌కి ఒప్పించినట్టు సమాచారం. సంజయ్ త్రిపాఠి సన్నిహితమిత్రులే ఈ విషయాన్ని వెల్లడించారని, అయితే, వారు తమ పేర్లు బహిర్గతం చేయడానికి నిరాకరించారని లైవ్‌మింట్ ఓ కథనంలో పేర్కొంది. లైవ్‌మింట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం నారాయణ మూర్తి మూవీ స్క్రిప్ట్ దశలో వున్నట్టు సమాచారం. 

Trending News