'కరోనా వైరస్' లేదా 'కోవిడ్-19'.. ఈ పేరు వింటనే ప్రపంచవ్యాప్తంగా ఒంటిలో వణుకు పుడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ . . ఇప్పటికే 27 దేశాలకు విస్తరించింది. కరోనా దెబ్బకు ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య దాదాపు 2 వేలు దాటింది. దీంతో చైనా సహా ..కరోనా వైరస్ పేరు చెబితేనే.. భయాందోళన చెందుతున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించిన కథలు .. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియా లో చైనా కరోనా వైరస్ కు సంబంధించి రకరకాల కథలు వైరల్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే .. కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగానే వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు.
ఇందులో చాలా ఎక్కువగా వైరల్ అవుతున్న కథనం.. చికెన్. అవును.. కోళ్లకు కరోనా వైరస్ సోకింది. వాటిని వండుకుని తింటే .. వైరస్ సోకుతుందనే చాలా వైరల్ గా మారింది. దీంతో భారత్ సహా చాలా ప్రాంతాల్లో కోళ్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. చాలా మంది చికెన్ కొనుగోలు చేసే వారే లేకుండా పోయారు. ఈ వైరల్ స్టోరీకి అనుగుణంగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఐతే ఇందులో నిజం లేదు. కోళ్లకు H5N1 వైరస్ సోకిన ఫోటోలు .. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు కూడా చైనాలోని హునాన్ ప్రావిన్స్ కు చెందినవే కావడం విశేషం. H5N1 ఈ వైరస్ వల్ల కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందని .. దీంతో 18 వేల కోళ్లను చంపేసినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న కోళ్ల ఫోటోలకు.. కరోనా వైరస్ కు సంబంధం లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ అనేది కేవలం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందే వైరస్. కాబట్టి ప్రస్తుతం వైరల్ అవుతున్న చికెన్ ఫోటోలకు కరోనా వైరస్ కు సంబంధం లేదు.
'కరోనా వైరస్'కు గంజాయి మందు..
మరోవైపు గంజాయి.. కరోనా వైరస్ కు మందు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఏం జరిగిందంటే . . గంజాయిని ఇండియాలో చట్టబద్ధం చేయాలని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. గతంలో 1980ల వరకు గంజాయిని ప్రభుత్వమే.. పాశ్చాత్య మందుల తయారీ కంపెనీలకు విక్రయించేదని .. అప్పట్లో అందరూ గంజాయిని అమ్మకుండా ఉండేందుకు చట్టబద్ధత లేదని ప్రచారం చేశారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో గంజాయికి చట్టబద్ధత లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఐతే ఈ ట్వీట్ ను కొంత మంది నెటిజనులు గంజాయి అనేది కరోనా వైరస్ కు మందుగా ఉపయోగపడుతుందని ప్రచారం చేశారు. కానీ దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. కాబట్టి .. గంజాయి .. కరోనా వైరస్ కు మందు అనేది ఫేక్ న్యూస్.
Solution to a lot of world's problems lie in India. But you can't find them as long as you ridicule our ancient wisdom.
Cannabis is a magic plant. Till 1980 it was sold by Govt. Becoz of Rajiv Gandhi & West Pharma Companies it got bad name.
Make #Cannabis legal !!#CoronaVirus pic.twitter.com/ciDsFIwM9x
— #NATIONALISM (@BeingNationali1) February 8, 2020