ప్రధానమంత్రి హోదాలో మాట్లాడవలసిన మాటలేనా ఇవి?

కర్నాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీల విమర్శలు, ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.

Last Updated : Feb 21, 2018, 12:13 PM IST
ప్రధానమంత్రి హోదాలో మాట్లాడవలసిన మాటలేనా ఇవి?

కర్నాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీల విమర్శలు, ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. 'నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా కొనసాగడానికి అనర్హుడు' అంటూ వ్యాఖ్యలు చేశారు.  

కర్నాటక సిఎం మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, మోదీ ప్రధానమంత్రి హోదాలో మాట్లాడవలసిన మాటలేనా ఇవి? అన్నారు. "రాష్ట్రంలో, దేశంలో మాట్లాడుకోవడానికి సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ మోదీ వాటి గురించి నోరుమెదపరు. ఆయన రాజకీయ ప్రేరేపిత, బాధ్యతారాహితమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ప్రధానమంత్రిగా కొనసాగటానికి అనర్హుడు" అని సిద్ధారామయ్య చెప్పారు.

సోమవారం మైసూరులో జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ హయాంలో కర్నాటక అవినీతిమయమైందని, రాష్ట్రంలో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని విమర్శించారు. తాను ఇటీవల బెంగళూరు బహిరంగ సభలో సిద్దరామయ్య ప్రభుత్వం పది శాతం కమిషన్ల ప్రభుత్వం అని విమర్శించానని.. అయితే అది అంతకంటే ఎక్కువని నాకు తర్వాత తెలిసిందని మోదీ వ్యాఖ్యానించారు.

Trending News