భారీగా వెనక్కు రానున్న భారతీయులు

అమెరికాలో ట్రంప్ సర్కారు అవలంభిస్తున్న కొత్తవిధానాలతో భారతీయులకు ఇక్కట్లు తొలిగేలాలేవు. 

Updated: Jan 3, 2018, 11:01 AM IST
భారీగా వెనక్కు రానున్న భారతీయులు

అమెరికాలో ట్రంప్ సర్కారు అవలంభిస్తున్న కొత్తవిధానాలతో భారతీయులకు ఇక్కట్లు తొలిగేలాలేవు. అమెరికా వీసాలను కఠినతరం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అమెరికా సర్కార్ విధానాలతో ఏకంగా భారీ మొత్తంలో భారతీయులు వెనక్కి వచ్చే అవకాశముందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. హోంలాండ్ విభాగం హెచ్-1బీ వీసాల నిభంధనలను కఠినతరం చేయడంతో పాటు గ్రీన్ కార్డు దరఖాస్తులు చాలావరకు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయులు అమెరికా నుండి భారతెదేశానికి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. 

ఎక్కువగా ఈ ప్రభావం ఐటీ రంగంపై ఉండబోతోంది. సుమారు 50 వేల నుండి 75 వేల వరకు భారతీయ హెచ్1 బీ వీసా హోల్డర్స్ తిరిగి స్వదేశానికి రావలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీసాలపై, గ్రీన్ కార్డులపై అమెరికా కరుణ చూపే అవకాశం లేకపోవడంతో.. అనేక మంది ఐటీ ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. అయితే దేశీయ ఐటీ రంగంపై ఈ ప్రభావం పడకుండా వీసా సంబంధిత సమస్యలపై అమెరికా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడూ చర్చలు జరుపుతూనే ఉంది. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close