DA Hike Latest News: 7వ వేతన సంఘం సిఫార్సు, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

 కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల DAను 4 శాతం పెంచాలని యోచిస్తోంది. కేంద్రంలోని 35 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల DAను 4 శాతం పెంచాలని యోచిస్తోంది. కేంద్రంలోని 35 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

1 /6

డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచాలని, పెండింగ్ బకాయిలు 4 శాతం సైతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, 2021 జనవరి నుంచి జూన్ వరకు కొత్త డీఏ 25 శాతం కానుంది.

2 /6

జూలై 2020 నుండి డిసెంబర్ వరకు అదనంగా 4 శాతం డీఏ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతంలో చేరలేదు. అదనపు డీఏ కోసం వారు ఎదురుచూస్తున్నారు.

3 /6

7వ వేతరణ సంఘం సూచనల తరువాత కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, ఇతర బెనిఫిట్స్ సైతం గణనీయంగా పెరుగనున్నాయి.

4 /6

7వ వేతన సంఘం(7th Pay Commission) నిబంధనల ప్రకారం, డీఏ పెంపు ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ట్రావెల్ అలవెన్స్ (టీఏ) కచ్చితంగా పెరుగుతంది. డీఏ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతం పెరుగుతుంది.

5 /6

సుమారు 58 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు డీఏ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief), డీఏతో నేరుగా అనుసంధానమై ఉంటుంది.

6 /6

7 వ వేతన సంఘం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా డీఏ బకాయిలు లభిస్తాయి. ఫిబ్రవరిలో DA ప్రకటించినట్లయితే, ఉద్యోగులకు జనవరి 2021 నెల బకాయిలు తరువాతి నెలలో అందుతాయి. ఎందుకంటే డీఏ అంటే జనవరి నుంచి జూన్ 2021 వరకు వర్తిస్తుంది.