7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్‌ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్

కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తి నేపథ్యంలో 2020లో మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. అయితే ఆ సమయంలో ఎల్‌టీసీ ప్రయాణం కోసం ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల నగదును పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది.

1 /5

ఎల్‌టీసీ ప్రయోజనం(LTC Benefits) కోసం బుక్ చేసుకున్న విమాన లేక రైలు టిక్కెట్ల రద్దు లేక రీషెడ్యూల్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్ మరియు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎల్‌టీసీ అడ్వాన్స్‌పై 3 ప్రధాన సడలింపులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. 7వ వేతన సంఘం(7th Pay Commission Latest Update) ఎల్‌టీసీ అలవెన్స్‌ను లింక్ చేసింది. Also Read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DAను తర్వగా పెంచాలన్న 7వ వేతన సంఘం

2 /5

కరోనా వైరస్(CoronaVirus) వ్యాప్తి సమయంలో గతేడాది దాదాపు రెండు నెలలు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో విమానాలు, రైలు సర్వీసులు రద్దయ్యాయి. కానీ అదే సమయంలో ప్రయాణం కోసం ముందుగానే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే టికెట్ల రద్దుపై విమానయాన సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసినట్లు సమాచారం.

3 /5

లాక్‌డౌన్ కాలంలో ఎల్‌టీసీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల టికెట్ మొత్తాన్ని పలు విమానయాన సంస్థలు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది. తమ వద్ద ఉన్న బుకింగ్ మొత్తాన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు 'క్రెడిట్ షెల్' రూపంలో ఉంచాయి, ఏడాదిలోపు వినియోగించుకోవాలని చెప్పాయి. ఏడాదిలోగా ప్రయాణం చేయడానికి వీలుకాని వారికి గడువు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరారు. ఎల్‌టీసీ అడ్వాన్స్‌పై వడ్డీని వసూలు చేయకూడదని ఓ ప్రకటనలో తెలిపింది. Also Read: Central Govt Employees Salary Hike: జనవరి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు

4 /5

విమాన, రైలు టికెట్లను ఎల్‌టీసీ అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నవారికి, రీ షెడ్యూల్ చేసుకున్న ప్రయాణికులకు సైతం ఒకేసారి తిరిగి చెల్లించాలని సూచించింది. ఎందుకంటే లాక్‌డౌన్ సమయానికి ముందుగా వీరు ఈ టికెట్లను బుక్ చేసుకోగా, విమానాలు, రైళ్ళను రద్దు చేయడంతో పాటు కొన్ని సర్వీసులు రీ షెడ్యూల్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణాలు చేయలేకపోయారు. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

5 /5

ఎల్‌టీసీ ప్రయాణానికిగా ముందుగా బుక్ చేసుకోగా.. సర్వీసులు రద్దు అయిన కారణంగా విమాన, రైళ్ల టికెట్లు రద్దు చేసుకున్నవారికి, రీషెడ్యూల్ వసూలు చేసుకున్న ఛార్జీలను రీయింబర్స్‌మెంట్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించింది.  ఫిబ్రవరి 28, 2021 వరకు 'క్రెడిట్ షెల్'లోని మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగి ఎల్‌టీసీ  ప్రయాణం చేయడానికి ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ఎల్‌టీసీ ప్రయాణానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తీసుకున్న ఎల్‌టీసీ అడ్వాన్స్ మొత్తంపై జరిమానా వడ్డీ వసూలు చేయబడదని సూచించింది.