Aashritha Daggubati: వెంకటేష్ కూతురు ఆశ్రిత పని ఏంటో తెలుసా.. ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

  • Jul 29, 2022, 08:33 AM IST
1 /5

Aashritha Daggubati Beautiful Photos: వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె తన తండ్రి బాటలో నడవకుండా తన ఆసక్తితో ఫుడ్ వ్లాగర్ గా మారి తెలుగు వారికి దగ్గరవుతోంది. కేవలం తెలుగు వారికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ ఆమె దగ్గరవుతోంది.

2 /5

తాను యుక్త వయసులో ఉన్న సమయంలో తన తండ్రి వెంకటేష్,  పెదనాన్న సురేష్ బాబు ఆఫ్రికా,  యూరోప్ లాంటి దేశాలకు షూటింగ్ కోసం వెళ్లి తిరిగి వచ్చాక అక్కడ రుచులు విశేషాలు చెప్పే వారని అలా కొత్త ప్రాంతాలు చూసి అక్కడ వింతలు,  విశేషాలు తెలుసుకోవడమే కాక ఆయా వంటకాల రుచి కూడా ఆస్వాదించాలని కోరిక పెరిగిపోయిందని ఆమె చెబుతూ ఉంటారు. అలాగే తాను ఫుడ్ వ్లాగర్ గా అయ్యానని ఆమె చెబుతూ ఉంటారు.

3 /5

ఇక మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్లానని అప్పటికి తనకు వంట రాదు కానీ ఒంటరిగా ఉండడంతో బయట ఫుడ్ కూడా తినలేక చిన్నచిన్నగా వంటలు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఫుడ్ వ్లాగర్ గా మారానని చెప్పుకొచ్చారు. 

4 /5

తొలుత ఇన్ఫినిటీ ఫ్లాటర్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఎకౌంటు ఓపెన్ చేసి తర్వాత యూట్యూబ్లో ఛానల్ కూడా ఓపెన్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

5 /5

 మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం అనే సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో ఆశ్రిత అంతర్జాతీయంగా 377,  ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఆమె తన వీడియోలతో బ్రాండ్ కొలాబిరేషన్స్ తో కోట్లలో సంపాదిస్తుందని సమాచారం.