Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..

Genelia Latest Pics: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి జెనీలియా. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను తెగ అలరిస్తుంది.
 

1 /5

సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్ జెనీలియా. సుమంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కన్నా ముందు జెనీలియా తమిళ డబ్బింగ్ చిత్రం బాయ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2 /5

కాగా సత్యం సినిమా తరువాత నుంచి జెనీలియా కి తెలుగులో ఎన్నో మంచి ఆఫర్లు రాసాగాయి. ముఖ్యంగా జెనీలియా చేసిన బొమ్మరిల్లు సినిమా ఆమె కెరియర్ లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా మిగిలింది.

3 /5

బొమ్మరిల్లు సినిమాలో హాసిని క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మనీయంగా నిలిచిపోయింది. కాగా ఈ చిత్రాన్ని మళ్లీ తమిళంలో, హిందీలో.. రీమేక్ చెయ్యగా ఆ భాషలలో కూడా జెనీలియానే హీరోయిన్ గా తీసుకున్నారు.

4 /5

ఇక కొద్ది సంవత్సరాల క్రితమే హిందీలో తాను చేసిన మొదటి సినిమా హీరో.. రితేష్ దేశముక్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది ఈ హీరోయిన్. పెళ్లి తరువాత నుంచి జెనీలియా సౌత్ సినిమాలలో పెద్దగా కనిపివ్వలేదు.

5 /5

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతూ.. ఒకప్పటి జెనీలియా ని తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేస్తున్నాయి.