Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రాముఖ్య‌త ఏమిటి ? ఈ పండ‌గ గురించి ఈ నిజాలు తెలుసా..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్ర‌తి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వ‌స్తోంది. హిందువుల‌కు అత్యంత ప‌విత్ర‌మైన రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వ‌స‌స్తువులు లేదా బంగారం, వెండి వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది. అస‌లు ఈ పండ‌గ ప్రాముఖ్య‌త ఏమిటంటే.. ?

1 /11

విష్ణువు ద‌శావతారాల్లో ఒక‌టైన ప‌రుశురాముడు ఇదే రోజున జ‌న్మించారు.

2 /11

అక్ష‌య తృతీయ రోజున సింహాచలంలో వ‌రాహా నర‌సింహాస్వామికి చంద‌నోత్స‌వం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ వ‌స్తోంది.

3 /11

భ‌గీర‌థుడి తపస్సుతో గంగాన‌ది భూమిని తాకిన ప‌విత్ర దినం

4 /11

రాముడి అవతారం అయిన త్రేతా యుగం మొద‌లైన రోజు ఇదే. 

5 /11

వ్యాస మ‌హ‌ర్షి వినాయ‌కుని స‌హాయంతో మహాభార‌తం వ్రాయడం మొద‌లైన దినం

6 /11

సూర్య భ‌గ‌వానుడు వ‌న‌వాసంలో ఉన్న ధ‌ర్మ‌రాజుకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం

7 /11

శ్రీ‌కృష్ణుడు త‌న బాల్య‌మిత్రుడైన కుచేలుడిని క‌లుసుకున్న దినం

8 /11

శివుడిని ప్రార్ధించి కుబేరుడు శ్రీ మ‌హాలక్ష్మి స‌హాయంతో స‌మ‌స్త సంప‌ద‌ల‌కు సంర‌క్ష‌కుడిగా నియ‌మింప‌బ‌డిన దినం

9 /11

జ‌గ‌ద్గురు ఆది శంక‌రులు క‌న‌క‌ధార స్త‌వం చెప్పిన దినం

10 /11

అన్న‌పూర్ణా దేవి త‌న అవ‌తారాన్ని స్వీక‌రించిన దినం

11 /11

పాండ‌వుల ప‌త్ని ద్రౌప‌దిని దుశ్శాస‌నుని బారి నుండి శ్రీ‌కృష్ణుడు కాపాడిన దినం