AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..

4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.

 

1 /7

  ఈ సారి ఆంధప్రదేశ్ అసెంబ్లీ బ‌రిలో పులివెందుల నుంచి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు  వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా  పోటీ చేయ‌డం ఇదే ఫస్ట్‌టైమ్.

2 /7

  ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి 8వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.  

3 /7

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆంధ్ర ప్రదేశ్‌లో కూట‌మి ఏర్పాటులో కీ రోల్ పోషించారు.

4 /7

  ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాజమండ్రి లోక్‌సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

5 /7

  ఇక ఉమ్మ‌డి ఏపీ చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం నుంచి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు.

6 /7

  హిందూపూర్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు నందమూరి బాలకృష్ణ.

7 /7

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.యస్.జగన్ సోదరి వైయ‌స్ ష‌ర్మిలా  ఎంపీగా కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ క‌డ‌ప నుంచి  పోటీ చేస్తున్నారు.