Axis Bank Credit card: ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే క్రెడిట్ కార్డు

Health and wellness benefits with Axis Bank Credit card: క్రెడిట్ కార్డు అంటేనే పేమెంట్స్, ఇంట్రెస్టులు, లేటుగా పేమెంట్ చేస్తే అదనపు వడ్డీలు వెరసి క్రెడిట్ కార్డు అంటేనే టెన్షన్ టెన్షన్ అంటుంటారు.. అలాంటిది క్రెడిట్ కార్డుతో ఆరోగ్య ప్రయోజనాలా ? అవేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఫోటో గ్యాలరీలో ఉన్న వార్తా కథనంపై దృష్టిసారించాల్సిందే.

  • Jan 23, 2021, 12:10 PM IST

Axis Bank Credit card with health benefits: కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి చాలామందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆరోగ్యం పట్ల జనం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధలను చూసిన యాక్సిస్ బ్యాంక్ ఆరోగ్య ప్రయోజనాలను అందించే లక్ష్యంతో ఆరా క్రెడిట్ కార్డు పేరుతో ఓ సరికొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది.

1 /7

"వినియోగదారులు కొనుగోలు చేస్తున్న వస్తు, సేవలను అధ్యయనం చేయగా.. వారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు తేలింది అని కార్డ్స్ అండ్ పేమెంట్స్ విభాగం హెడ్ సంజీవ్ మోఘే తెలిపారు.

2 /7

కస్టమర్స్‌కి హెల్త్ బెనిఫిట్స్ అందించడం కోసం యాక్సిస్ బ్యాంక్ పోష్విన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండస్ హెల్త్ ప్లస్ అనే హెల్త్ చెకప్ సంస్థ అలాగే ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫామ్ ప్రాక్టో నుండి కూడా ప్రయోజనాలు కలిగే విధంగా యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది.

3 /7

యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసిన ఆరా క్రెడిట్ కార్డుతో ( Credit cards ) ఇండస్ హెల్త్‌ ప్లస్ ద్వారా వార్షిక వైద్య పరీక్షలపై కార్డుదారులు ₹ 500 వరకు తగ్గింపు పొందేందుకు అర్హులు అవుతారు. ఈ కార్డు ఉపయోగించడం ద్వారా ప్రాక్టోతో నెలకు నాలుగు ఉచిత ఆన్‌లైన్ వీడియో కన్సల్టేషన్స్ సైతం లభిస్తాయని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. ప్రాక్టోలో వీడియో కన్సల్టేషన్స్‌కి ( Video consultations ) అందుబాటులో ఉన్న మొత్తం 21 రకాల వైద్య సేవలకు సంబంధించి 24X7 కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుంది.

4 /7

ఫిట్టర్నిటీ అనే హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ క్రెడిట్ కార్డుతో నెలకు నాలుగు ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ఫిట్‌నెస్ సెషన్లను ( Online fitness sessions ) ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు నెలకు 16 రికార్డ్ చేసిన ట్రైనింగ్ సెషన్లకు కూడా ప్రవేశం ఉంటుంది.

5 /7

డెకాథ్లాన్‌తో కూడా యాక్సిస్ బ్యాంక్ ( Axis bank ) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వెల్‌కమ్ బెనిఫిట్‌గా ఆరా క్రెడిట్ కార్డుదారులకు రూ .750 డెకాథ్లాన్ షాపింగ్ వోచర్ లభిస్తుంది.

6 /7

యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కార్డుదారుల ( Axis Bank Credit cardholders ) నుండి యాన్వల్ ఫీజు కింద రూ .749 వసూలు చేయనున్నారు.

7 /7

ఇక ఫైనాన్స్ ఛార్జీల విషయానికొస్తే.. నెలకు 3.4% లేదా సంవత్సరానికి 49.36% ఫైనాన్స్ చార్జ్ వసూలు చేయనున్నారు.