Sri Rama Navami Quotes 2024 In Telugu: శ్రీ రామ నవమి 2024 కోట్స్, వాట్సప్ మెసేజెస్, HD ఫోటోస్‌..


Sri Rama Navami Quotes And HD Images 2024 In Telugu: దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు శ్రీరామనవమి పండుగ ఒకటి. ఈ పండగను అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ కుటుంబ సభ్యులకు బంధువులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

Sri Rama Navami Quotes And HD Images 2024 In Telugu: ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన వచ్చింది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండగ రోజున రామ భక్తులంతా ఊరూరా శ్రీరామ నామ స్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారు అంతేకాకుండా రామాలయాలలో సీతారాముల కళ్యాణాలను నిర్వహిస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, దానధర్మాలు కూడా చేస్తారు. అంతేకాకుండా రామ భక్తులంతా ఉపవాసాలు పాటించి శ్రీరామ నామస్మరణతో భక్తిలో లీనమవుతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రత్యేకమైన శ్రీరామనవమి శుభాకాంక్షలు, కోట్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి
 

1 /6

"సత్యం వంతున నడవడం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం రాముడి బోధనలు" రాముడు ఎల్లప్పుడూ సత్యంగా ముందుకు సాగాలని, జీవితంలో వస్తున్న సమస్యలను కూడా సత్యమార్గంలోని పరిష్కరించాలని సూచించారు.

2 /6

"సేవా భావంతో పనిచేయడం, దుఃఖితులకు సహాయం చేయడం రాముడి ఆదర్శాలు" శ్రీరాముడు సేవాభావంతో పనిచేయమని దుఃఖంతో ఉన్నవారికి సహాయం చేయమని ఎంతో గొప్పగా రామరాజ్యంలో తెలిపారు.  

3 /6

"మనసులో మంచి భావాలు ఉంచుకోవడం, కోపాన్ని జయించడం రాముడి గుణాలు" మనసులో మంచి భావాలు ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ శక్తివంతుడే అని శ్రీరాముడు స్వయాన తన మాటల్లో చెప్పారు.  

4 /6

"ధైర్యంతో ముందుకు సాగడం, ఎదురయ్యే సాన్ని ఎదుర్కోవడం రాముడి పాఠాలు" - గతంలో ఎదురయ్యే సమస్యలను దృఢ సంకల్పంతో ఎదుర్కోవడం ధైర్యంతో ముందుకు సాగడం శ్రీరాముడి లక్షణం.

5 /6

"కుటుంబం విలువను గౌరవించడం, బంధాలను కాపాడుకోవడం రాముడి ప్రత్యేకమైన లక్షణం"  తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం, బంధాలను కాపాడుకోవడం శ్రీరామ లక్షణాల్లో ఎంతో ప్రధానమైనది.  

6 /6

"విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, జ్ఞానాన్ని అర్జించడం రాముడి ఆదర్శాలు"  జీవితంలో విద్యా ప్రాముఖ్యతను గుర్తించడం జ్ఞానాన్ని ఆర్జించడం రాముడి ప్రత్యేకమైన లక్షణం..