Happy Janmashtami Wishes 2023: శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకమైన కోట్స్, ఫొటోస్ మీకోసం..

Happy Krishna Janmashtami 2023 Wishes: శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ మీ కోసం ప్రత్యేకమైన కోట్స్, ఫొటోస్ ని జీ తెలుగు న్యూస్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఫోటోస్‌ని వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి.
 

  • Sep 07, 2023, 09:43 AM IST

Happy Krishna Janmashtami 2023 Wishes: హిందువులకు అత్యంత ప్రాముఖ్యమైన పండగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగగా జరుపుకుంటారు. ఈ పండగను అన్ని రాష్ట్రాల ప్రజలు ఘనంగా రెండు రోజులపాటు జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉట్లను తెంపే కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాకుండా చిన్నారులకు శ్రీకృష్ణుడిలా వేషధారణ చేసి.. సాక్షాత్తు కృష్ణడిగా భావిస్తారు. ఇక వైష్ణవులైతే రెండు రోజులపాటు ఉపవాసాలు పాటించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు రాధాకృష్ణల అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఆయన అనుగ్రహం కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు లభించాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలను మీకు అందిస్తోంది జీ తెలుగు న్యూస్..

1 /5

శ్రీకృష్ణుడి చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

2 /5

ఆ నందగోపాలుడి చల్లని దీవెనలు, ఆశీర్వాదాలు మీకు కలగాలని కోరుకుంటూ..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

3 /5

శ్రీకృష్ణుడి అనుగ్రహంతో జీవితంలో కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ..హ్యాపీ కృష్ణాష్టమి.

4 /5

కృష్ణుడి చల్లని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ..కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

5 /5

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.