iPhone 14 Best Price: అమేజాన్ vs ఫ్లిప్‌కార్ట్ vs విజయ్ సేల్స్.. మూడింట్లో ఎక్కడ తక్కువ ధర ?

ఒకవేళ మీరు ఐఫోన్ 14 కొనే ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఈ డీటేల్స్ మీ కోసమే. అమేజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, విజయ్ సేల్స్‌లో.. ఈ మూడింట్లతో పోల్చితే.. ఐఫోన్ 14 ధరపై ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది ? ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఆఫర్స్ లభిస్తున్నాయో తెలుసా ?
  • May 06, 2023, 18:23 PM IST

iPhone 14 Best Price: ఒకవేళ మీరు ఐఫోన్ 14 కొనే ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఈ డీటేల్స్ మీ కోసమే. అమేజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, విజయ్ సేల్స్‌లో.. ఈ మూడింట్లతో పోల్చితే.. ఐఫోన్ 14 ధరపై ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది ? ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఆఫర్స్ లభిస్తున్నాయో తెలుసా ?

1 /6

ఐఫోన్ కొనే వారు ఎక్కడెక్కడ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయా అని వెతికే పని లేకుండా సింగిల్ స్టాప్ సొల్యూషన్ తరహాలో ఇక్కడే మీకు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 14 పై అందుబాటులో ఉన్న డీల్స్ వివరాలు అందించడం జరుగుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. హావ్ ఏ లుక్ ఆన్ ఇట్..

2 /6

iPhone 14 Best Price Deals: మీకు ఐఫోన్ 14 అంటే ఇష్టమా ? ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, ఐఫోన్ 14 ఫోన్ సొంతం చేసుకోవడానికి ఇదే రైట్ టైమ్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌తో పాటు విజయ్ సేల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌కి లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ ఈ మూడు చోట్లలో పోల్చి చూస్తే ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుకుందాం రండి.

3 /6

అమెజాన్‌లో ఐఫోన్ 14 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ ధర 79,900 రూపాయలకు లభిస్తుండగా ఇప్పుడు అది డిస్కౌంట్ తరువాత రూ. 66,900 కే కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ కలిగి ఉన్న వారు 10 శాతం తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతటితో ఆఫర్ అయిపోలేదు.. ఎక్స్‌చేంజ్ కింద రూ. 19,950 కే ఐఫోన్ 14 ని ఇంటికి తీసుకెళ్లొచ్చు.

4 /6

ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ కలిగి ఉన్న ఫోన్ ధర రూ.67,999 కాగా.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ.1,250 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా మీ పాత ఫోన్‌ని ఎక్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ. 29,000 వరకు ధరను తగ్గించుకోవచ్చు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ కండిషన్‌ని బట్టి ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది.

5 /6

ఐఫోన్ 14 అసలు ధర రూ. 79,900 కాగా.. ప్రస్తుతం రూ. 70,990 కే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. మీ వద్ద హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ ఉన్నట్టయితే.. ఆ కార్డుతో పేమెంట్ చేయడం ద్వారా రూ. 4,000 డిస్కౌంట్ అందుకోవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద కనిష్టంగా రూ. 5,000 ఆఫర్ అందుబాటులో ఉండగా.. విజయ్ సేల్స్ అదనంగా మీకు రూ. 3,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇవన్నీ ఆఫర్స్ కలిపి విజయ్ సేల్స్ అందించే డిస్కౌంట్ రూ. 20,910 వరకు ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే.. అంతిమంగా విజయ్ సేల్స్ మాల్స్‌లో ఐఫోన్ 14 ఫోన్ 58,990 రూపాయలకే లభిస్తుంది.

6 /6

ఐఫోన్ 14 ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 128GB, 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌తో లభిస్తున్న ఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ 14 మిడ్‌నైట్, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్, బ్లూ కలర్, స్టార్‌లైట్ ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14 12MP ప్రైమరీ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది. బెస్ట్ వీడియో క్వాలిటీ కోసం సినిమాటిక్ మోడ్‌ కూడా యాడ్ చేశారు. ఇవి ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్.