Janhvi Kapoor: అతిలోకసుందరిలా మారిపోయిన జాన్వి కపూర్.. అచ్చం శ్రీదేవిలా

Janhvi Kapoor as Athiloka Sundari: జాన్వి కపూర్ తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా ఆమెకు విపరీతమైన అభిమానులు మాత్రం ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /4

ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జాన్వి కపూర్. ఇప్పటివరకు ఈ హీరోయిన్ తెలుగులో మాత్రం ఏ చిత్రం చేయలేదు.  

2 /4

త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా విడుదల కన్నా ముందే ఈ హీరోయిన్ కి తెలుగు రాష్ట్రాలలో అభిమానులు మాత్రం ఎంతో మంది ఉన్నారు.  

3 /4

ఇందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ తెలుగువారు ఎంతో అభిమానించే శ్రీదేవి కూతురు కావడం. తెలుగులో శ్రీదేవికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిని ఎంతో అపురూపంగా అతిలోకసుందరి అని పిలుచుకుంటారు.

4 /4

ఈ క్రమంలో జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు శ్రీదేవిని తలపించడంతో అందరూ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో జాన్వి అచ్చం శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఎలా ఉందో అలానే కనిపిస్తూ అభిమానులను ప్రేమలో పడేస్తోంది.