Kajal: చందమామలా మెరిసిపోయిన కాజల్..కొత్త ఫోటోలు చూశారా

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటనతోనే కాకుండా తన అందంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ హీరోయిన్

1 /5

కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /5

అక్కడి నుంచి వరస అవకాశాలు రావడంతో తెలుగులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కాజల్. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరితో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

3 /5

తమిళంలో సైతం కొన్ని చిత్రాలు చేసి మెప్పించింది ఈ హీరోయిన్. ఇక సింగం హిందీ డబ్బింగ్ చిత్రంతో బాలీవుడ్లోకి సైతం అడుగుపెట్టింది.  

4 /5

అయితే కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. గత కొద్దిరోజుల నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిచనుంది.

5 /5

ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో వైట్ గాగ్రాలో మెరిసిపోతూ కనిపించింది కాజల్.