Minister Harish Rao convoy: మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ యాక్సిడెంట్ స్పాట్ ఫోటోలు

Minister Harish Rao car meets with an accident: సిద్దిపేట: మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి మంత్రి హరీష్ రావు  హైదరాబాద్ వెళ్తుండగా హరీష్ రావు కాన్వాయ్‌లోని కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. 

  • Jun 21, 2021, 00:36 AM IST

Minister Harish Rao car meets with an accident: సిద్దిపేట: మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఆదివారం రాత్రి మంత్రి హరీష్ రావు  హైదరాబాద్ వెళ్తుండగా హరీష్ రావు కాన్వాయ్‌లోని కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. కొండపాక సమీపంలో హరీష్ రావు కాన్వాయ్‌లో (Minister Harish Rao convoy) ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డుగా రావడంతో ముందు కారు డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేశాడు. 

1 /9

కొండపాక సమీపంలో హరీష్ రావు కాన్వాయ్‌లో (Minister Harish Rao convoy) ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డుగా రావడంతో ముందు కారు డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేశాడు. 

2 /9

ఈ ప్రమాదంలో సడెన్ బ్రేక్స్ వేసిన ముందు కారు వెనుకే వస్తున్న హరీష్ రావు పైలట్ కారు, ఆ పైలట్ కారు వెనకాలే వస్తున్న మంత్రి హరీష్ రావు కారు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

3 /9

ఈ ప్రమాదంలో ముందు కారులో ఉన్న వారిలో ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. కారులోంచి కిందికి దిగి పరిస్థితిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. గాయాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరో కారులో అక్కడి నుంచి హైద్రాబాద్ బయల్దేరారు.

4 /9

ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి హరీష్ రావు (Minister Harish Rao car accident) డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్పగాయాలయ్యాయి. కారులోంచి కిందికి దిగి పరిస్థితిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించి మరో కారులో అక్కడి నుంచి హైద్రాబాద్ బయల్దేరారు. 

5 /9

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ప్రమాదం బారినపడటం ఇది మొదటిసారికాదు.

6 /9

గతంలో 2018, మార్చి 17న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హోదాలో మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలించడానికి వెళ్లి వస్తుండగా కాన్వాయ్‌లో (Harish Rao convoy car catches fire) ముందున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

7 /9

సాధారణంగా మంత్రి హరీష్ రావు వినియోగించే కారు అది కానీ ఆరోజు మంత్రి మరో కారులో ఉండటం, కాన్వాయ్‌లోని కారు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు నిలిపేయడంతో అప్పట్లో ప్రమాదం తప్పింది.

8 /9

కారు ఇంజిన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగినట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు.

9 /9