Egypt Treasure: ఈజిప్టు సముద్రంలో అంతులేని ఖజానా, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిదని అంచనా

Egypt Treasure: ఈజిప్టు సముద్రంలో పరిశోధకులకు భారీ ఖజానా లభ్యమైంది. యూరోపియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ పరిశోధకులు ఈజిప్టు సముద్రతీరంలోని ఓ ప్రాంతంలో భారీ ఖజానాతో పాటు కొన్ని రహస్య వస్తువుల్ని అణ్వే,షించి తీశారు. 

Egypt Treasure: ఈజిప్టులో ఈ పరిశోథకులు వెలికి తీసిన ఖజానా, ఇతర వస్తువులన్నీ మునిగిపోయిన ఓ ఆలయానికి చెందినవిగా పరిశోథకులు వెల్లడించారు. ఈ పోర్ట్ సిటీ అణ్వేషణకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

1 /5

మందిరంలోని తూర్పు భాగంలో  ఫిరౌన్ చక్రవర్తి కాలంలో ఆరాధించే దేవీ దేవతలు విగ్రహాలు లభ్యమయ్యాయి.

2 /5

ఈ వస్తువులతో పాటు ఈజిప్టు సముద్రంలో కుబేరుడి ఖజానా బయటపడింది. అందులో వజ్ర వైఢూర్యాలు, మణి మాణిక్యాలు అన్నీ ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతానికి లెక్కించలేకపోతున్నారు.

3 /5

క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన నాణ్యమైన కలపతో చేసిన స్థంభాలు సురక్షితంగా లభ్యమయ్యాయి.   

4 /5

మందిరం వెలికితీతతో చాలా విలువైన వస్తువుల గురించి తెలిసింది. పూజాది కార్యక్రమాల్లో వినియోగించే  వెండి పరికరాలు, బంగారు ఆభరణాలు, అత్తరు కంటైనర్లు లభించాయి. ఈ సంపద చాలా విలువైందిగా తెలుస్తోంది. వేలాది సంవత్సరాల క్రితం ఈ పోర్ట్ సిటీలో ఉండే ప్రజలు ఆధ్యాత్మికత గురించి కూడా ఈ పరిశోధనతో తెలిసింది.

5 /5

దక్షిణ ప్రాంతంలో జరిపిన పరిశోధనలో ఓ ప్రాచీన మందిరానికి చెందిన రాతి భాగాలు లభ్యమయ్యాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో జరిగిన ఓ ప్రళయంలో ఇది నీట్లో మునిగిపోయందని తెలుస్తోంది. దీనిని అమూన్ దైవ మందిరంగా భావిస్తున్నారు.