New York Floods: న్యూయార్క్‌లో వరద బీభత్సం, ఎటు చూసినా నీళ్లే, వరద దృశ్యాలివే

New York Floods: అమెరికాలోని న్యూయార్క్‌లో తుపాను బీభత్సం కారణంగా  భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విమానాల రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. వాహనాలు చాలావరకూ నీట మునిగాయి.

1 /6

విమానాశ్రయంలో ఇంధనం నింపే ప్రాంతాలు నీట మునిగిపోవడంతో రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. వరద కారణంగా మూడు టెర్మినల్స్‌లో ఒకటి మూసివేశారు.

2 /6

సబ్‌వే, రైలు పట్టాలపై సైతం నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంట్లోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

3 /6

జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని నీళ్లలో కారుతో సహా  చిక్కుకున్న ఓ మహిళ తెలిపింది. చాలా ప్రాంతాల్లో బేస్‌మెంట్ వరకూ నీళ్లు కన్పిస్తున్నాయి.

4 /6

తుపాను, భారీ వర్షాల కారణంగా రాకపోకలు స్థంభించిపోయాయి. మన్‌హట్టన్ తూర్పు ప్రాంతంలో ప్రధాన రహదారిపై కార్లు, వాహనాలు నీట మునిగిపోయాయి.

5 /6

ఇది చాలా భయంకరమైందని, జీవితాల్ని ప్రమాదానికి నెట్టివేసే తుపాను అని న్యూయార్క్ గవర్నర్ హెచ్చరించారు. రానున్న 20 గంటల వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చన్నారు.

6 /6

న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా 13 సెంటీమీటర్ల మేర భారీ వర్షం నమోదైంది. పగలు 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.