Oppo Price Cut on Smartphones: ఈ ఒప్పో ఫోన్లపై డిస్కౌంట్ సేల్.. ఆకర్షణీయమైన ధరలు

  • Nov 27, 2020, 10:54 AM IST

ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై ధరలు తగ్గించింది. నాలుగు రకాల ఒప్పో మొబైల్ మోడల్స్‌ ధరలు (Oppo Price Cut on Smartphones) తగ్గడంతో ఈ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరిగాయి. తమ స్మార్ట్‌ఫోన్లపై ఒప్పో రూ.500 నుంచి రూ.2,000 వరకు ధర తగ్గించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో ధరలు దిగొచ్చాయి.

1 /5

2 /5

Oppo A12 Price in India: ఒప్పో ఏ12 మొబైల్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ సామర్థ్యమున్న మోడల్‌పై రూ.500 వరకు ధర దిగొచ్చింది. ప్రస్తుతం రూ.9,490 ఉన్న ధర రూ.8,990కు ఒప్పో తగ్గించింది. కేవలం కొన్ని ప్రత్యేకమైన వేరియంట్లపై మాత్రమే డిస్కౌంట్ ప్రకటించారు.

3 /5

Oppo Reno 3 Pro Specifications: ఒప్పో రెనో 3 ప్రో స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.2,000 ధర తగ్గింది. రూ.29,990 నుంచి రూ.27,900కు ధర దిగొచ్చింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,000 ఆఫర్ అందించింది.

4 /5

Oppo A15 Specifications: ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ సామర్థ్యమున్న మోడల్ ధర రూ.1,000 తగ్గింపు ప్రకటించారు. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్‌పై రూ. 500వరకు ఆఫర్ అందించింది.

5 /5

Oppo F17 Price in India | ఒప్పో ఎఫ్17 మొబైల్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల మోడల్ రూ.500 తగ్గించింది. ధర రూ.18,990 నుంచి రూ.18,490కి తగ్గింది. అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. సీజన్ లేకున్నా ధరలు తగ్గింపుపై ఒప్పో నిర్ణయం తీసుకుంది.