Sreeleela: జీన్స్ స్కర్ట్ లో శ్రీలీల…ఎప్పుడూ లేనంత స్టైలిష్ గా!

Sreeleela Bold Photos: సినిమాలలోనే కాదు ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో కూడా సెన్సేషనల్ గా మారుతుంది శ్రీలీల. ఈ క్రమంలో శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
 

1 /5

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను.. తమ వైపు తిప్పుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంగతి. అయితే శ్రీలీల మాత్రం అది చాలా తేలిగ్గా చేసేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన.. పెళ్లి సందడి సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈ హీరోయిన్.

2 /5

ఇక వెంటనే రవితేజాతో చాన్స్ అందుకొని.. ధమాకా సినిమాలో తన డాన్స్ విశ్వరూపం చూపించింది. దాంతో తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు.

3 /5

ఇక ఏ హీరోయిన్ అందుకోనంత చాన్సులతో దూసుకుపోయింది ఈ హీరోయిన్. వరుసగా తొమ్మిది సినిమాలు ఒకేసారి అందుకని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

4 /5

ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా త్వరలోనే శ్రీలీల హవా నడిచేతట్టు కనిపిస్తోంది. అందుకు ముఖ్య కారణం అక్కడ అజిత్, విజయ్, కార్తీ సినిమాలలో శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.

5 /5

ఈ క్రమంలో శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు కాస్త తెగ వైరల్ అవుతూ అందరిని మరింత ఆకట్టుకుంటున్నాయి.