Hyderabad: చల్లబడిన న'గరం'.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు..

Hyderabad Rain: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల ప్రభావానికి సామాన్య జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎండకు భయపడి ప్రజలు బైటకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

  • May 07, 2024, 17:26 PM IST
1 /6

భానుడు భగభగలకు ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోయారు. ఎప్పుడు లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటేశాయి. ఇక అనేక ప్రాంతాలలో ఉక్కపోతతో జనాలు విలవిల్లాడిపోయారు. వడదెబ్బలతో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది.   

2 /6

ఇంట్లోనుంచి ఆఫీసు పనులు మీద బైటకు వెళ్లిన కూడా నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తాగుతుండాలని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలని కూడా నిపుణులు సూచించారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ లు, వేపుళ్లకు దూరంగా ఉండాలని కూడా తెలిపారు. 

3 /6

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇటీవల తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందని కూడా సూచనలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల వాతావరణంలో మార్పులు జరిగిన ఒక మోస్తరు నుంచి మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.

4 /6

వాతావరణ కేంద్రం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి వాతావరణం కాస్తంతా చల్లగా మారిపోయింది. ఇకసాయంత్రం అనేక ప్రాంతాలలో మోస్తరు వర్షం కురవడంతో పాటు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించాయి. 

5 /6

ఇప్పటిదాక ఎండలు కొట్టి, ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో జనాలు ఎండ నుంచి ఉపశమనం లభించిందని కాస్తంత రిలాక్స్ అవుతున్నారు. ఇంటికే పరిమితమైన వారంతా రోడ్లు, మిద్దెల మీదకు చేరుకుని కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల ఈదురుగాలులు వీస్తున్నాయి.

6 /6

బలమైన ఈదురు గాలులతో పాటు, వర్షం కూడా పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండే ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయత్రం పూట, ఆఫీసుల నుంచి బైటకు వెళ్లే సమయంలో ఈదురుగాలులు, వర్షం పడుతుండటంతో అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం.