Vivo T3X 5G Price Drop: "డిస్కౌంట్ ఆలర్ట్‌" లాంచింగ్‌కి ముందే Vivo T3X మొబైల్‌పై భారీ తగ్గింపు.. రూ.10 వేలే!

Vivo T3X 5G Price Drop: అతి త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3x స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ మొబైల్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నారు.

 

Vivo T3X 5G Price Drop: అతి తక్కువ ధరలో లభించే ఎక్కువ ఫీచర్స్ కలిగిన వివో మొబైల్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కంపెనీ స్మార్ట్ ఫోన్స్‌ను ఎంత మిడిల్ బడ్జెట్లో లాంచ్ చేసిన ప్రీమియం కెమెరాతో తమ కస్టమర్స్‌కి అందుబాటులో ఉంచుతుంది. దీంతో చాలామంది కస్టమర్ ఎక్కువగా వివో మొబైల్స్‌నే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

1 /6

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లో తమ కొత్త కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకొని అతి చౌక ధరలోనే ఇటీవలే T3x మోడల్ ను లాంచ్ చేసింది. టీ సిరీస్ మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించడంతో వాటికి సక్సెసర్‌గా  దీనిని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.

2 /6

వివో కంపెనీ ఇప్పటికే ఈ T3x మోడల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కూడా వెల్లడించింది. దీనిని కంపెనీ తమ స్టోర్స్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది.

3 /6

ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వివో T3x స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పోస్టర్ కూడా లైవ్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ దీని సేల్స్‌ను ఏప్రిల్ 24వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది.

4 /6

అంతే కాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన ధరను కూడా కంపెనీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతోంది. కంపెనీ ఈ మొబైల్ రూ. 12,499 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతోంది.

5 /6

అలాగే ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్ పై డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,500 వరకు తగ్గింపు లభించబోతోంది.  దీంతో బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 10,999కే పొందవచ్చు.  

6 /6

అలాగే ఈ మొబైల్ పై ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ అని కూడా అందుబాటులోకి ఉంచబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ముఖ్యంగా అతి త్వరలోనే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.