Vivo X90 Pro Specs: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ?

 కొత్త ప్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? కొత్తగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వివో ఎక్స్90 ప్రో మొబైల్ గురించి మీకు తెలుసా ? ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కాస్ట్‌లీ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఇదిగో ఇటువైపు ఒక లుక్కేయండి. 

  • Apr 28, 2023, 17:04 PM IST

Vivo X90 Pro Specs: కొత్త ప్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? కొత్తగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వివో ఎక్స్90 ప్రో మొబైల్ గురించి మీకు తెలుసా ? ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కాస్ట్‌లీ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఇదిగో ఇటువైపు ఒక లుక్కేయండి. 

1 /12

Vivo X90 Pro 5G Phone: వాస్తవానికి గతేడాది నవంబర్‌లోనే లాంచ్ కావాల్సిన వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్స్‌ని ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ కస్టమర్స్ సైతం ఈ ఫోన్ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. 

2 /12

Vivo X90 Pro 5G Phone: ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఒకటి. ఏప్రిల్ 26నే ఈ ఫ్లాగ్‌షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. 

3 /12

Vivo X90 Pro 5G Phone: ఏప్రిల్ 26న ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫ్లాగ్‌షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మే 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇండియాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. 

4 /12

Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ స్మార్ట్ ఫీచర్స్‌లో కెమెరా లెన్స్ గురించే ముందుగా చెప్పుకోవాలి. వివో ఎక్స్90 ప్రో మెయిన్ కెమెరా కోసం జర్మనీకి చెందిన జీస్ (ZEISS) లెన్స్‌తో ఈ కెమెరాను రూపొందించారు. ఆప్టికల్ సొల్యూషన్స్‌లో, లెన్స్ పిక్చర్ క్వాలిటీలో జీస్ వరల్డ్ లీడర్ అనే విషయం తెలిసిందే.

5 /12

Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ ధరను వివో కంపెనీ రూ. 84,999 గా నిర్ణయించింది. 12GB + 256GB స్టోరేజీ వేరియంట్‌పై 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ లభించనుంది. ఈ వేరియంట్‌లో కేవలం లెజెండరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఫోన్ లభిస్తోంది.

6 /12

Vivo X90 Pro 5G Phone: కస్టమర్స్‌కి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఈ ఫోన్‌ని మీడియా టెక్ డైమెన్సిటీ 9200, ప్రో ఇమేజింగ్ చిప్ వి2 తో రూపొందించారు.

7 /12

Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ కెమెరా సెటప్ అద్భుతంగా ఉంటుంది. ఈ పోన్ వెనుక భాగంలో 12MP వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP పోట్రేట్ కెమెరా లార్జ్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్‌తో 50MP జీస్ 1 ఇంచ్ మెయిన్ కెమెరా ఉన్నాయి.

8 /12

Vivo X90 Pro 5G Phone: వివో ఎక్స్90 ప్రో ఫోన్ లోని అద్భుతమైన ఫీచర్స్ కి సపోర్ట్ చేసేలా, నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం శక్తివంతమైన 4870 mAH బ్యాటరీని అమర్చారు. బ్యాటరీని వేగంగా చార్జింగ్ చేసేలా 120 w డ్యూయల్-సెల్ ఫ్లాష్ చార్జ్ సౌకర్యం ఉంది.

9 /12

Vivo X90 Pro 5G Phone: అలాగే అందమైన సెల్ఫీల కోసం ముందు భాగంగా 32 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

10 /12

Vivo X90 Pro 5G Phone: 6.87 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ కంటి చూపుపై ప్రభావం పడకుండా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్థాయిల్లో స్మార్ట్ ఐ ప్రొటెక్షన్ మోడ్ కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు వివో కంపెనీ ప్రకటించింది. 

11 /12

Vivo X90 Pro 5G Phone Users reviews : వివో ఎక్స్90 ప్రో ఫోన్ పని తీరు ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందనేది మే 5న ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాకే యూజర్స్ రివ్యూస్ బయటికొస్తే కానీ తెలిసే అవకాశం లేదు.

12 /12

Vivo X90 Pro 5G Phone Unboxing reviews : వివో ఎక్స్90 ప్రో ఫోన్ చేతికి వస్తే అదెలా ఉంటుందో చూద్దాం అని ఎదురుచూస్తున్న వారి సంఖ్య భారీగానే ఉన్నట్టు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ ఫోన్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థం అవుతోంది.అందుకే వివో ఎక్స్90 ప్రో అన్‌బాక్సింగ్ రివ్యూస్‌కి కూడా భారీగా స్పందన లభించే అవకాశం ఉంది.