Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!


Voter List 2024: అందులో మీ పోలింగ్ నంబర్ మీ పేరు, ఇతర పూర్తి వివరాలను సెక్లలలో సులభంగా ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 

Voter List 2024: భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు ఈ ఎన్నికలు 3వ దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమీషన్‌  సుమారు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా  సుమారు 96.8 కోట్ల మంది ప్రజలు ఓటు వెయ్యబోతున్నట్లు అధికారిక సమాచారం. అయితే మీరు కూడా ఓటు వేసున్నారా? ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? అనే సమాచారాన్ని ఇలా సులభంగా SMS ద్వారా తెలుసుకోండి.
 

1 /6

సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా మీ సేవాకు వెళ్లకుండానే ఓటింగ్ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.  ఓటింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. అయితే ఈ సంవత్సరమే అప్లే చేసుకున్న వారు తప్పకుండా ఓటింగ్ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది.   

2 /6

SMS ద్వారా ఓటరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక మొబైల్‌ను తీసుకుని ఇలా మేము అందించిన వివరాల ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.  

3 /6

మీ ఓటర్‌ ID కార్డు సంబంధించిన పూర్తి వివరాలు, ఓటింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ నుంచి టెక్స్ట్ సందేశాన్ని పంచాల్సి ఉంటుంది.  

4 /6

దీని కోసం ముందుగా ఫోన్‌లో సాధారణ  మెసేజ్‌ బాక్స్ ఓపెన్‌ చేసి మెసేజ్‌లో EPIC అని వ్రాసి, దీంతో పాటు మీ ఓటర్ ID కార్డ్ కూడా టైప్‌ చేయాల్సి ఉంటుంది.

5 /6

ఇలా రాసిన సందేశాన్ని 9211728082 లేదా 1950కి నంబర్లకు మెసేజ్‌ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు ఒక సందేశం వస్తుంది.  

6 /6

ఇలా మెసేజ్‌ చేసిన తర్వాత మీ నంబర్‌కు ఎన్నికల కమీషన్‌ నుంచి సందేశం వస్తుంది. అందులో మీ పోలింగ్ నంబర్‌తో పాటు మీ పూర్తి పేరు, ఇతర వివరాలు ఉంటాయి.