World Heritage Day 2024: ఇండియాలో యునెస్కో గుర్తించిన టాప్ 5 హెరిటేజ్ ప్రాంతాలివే

ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే ఉంది. సాంస్కృతిక, చారిత్రక వారసత్వం మహత్యం, ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో చారిత్రక కట్టడాలను సంరక్షించడం చేయాలి. భారతదేశంలో కూడా ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇండియాలో కూడా యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సెంటర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

World Heritage Day 2024: ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే ఉంది. సాంస్కృతిక, చారిత్రక వారసత్వం మహత్యం, ప్రాధాన్యతను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో చారిత్రక కట్టడాలను సంరక్షించడం చేయాలి. భారతదేశంలో కూడా ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇండియాలో కూడా యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సెంటర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1 /5

కోణార్క్ సూర్య దేవాలయం కోణార్క్‌లోని సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో రాజా నరసింహదేవ్ నిర్మించాడు. సూర్యుని కొలిచే హిందూ దేవాలయమిది. ఈ ఆలయం విశాలమైన రధం ఆకారంలో ఉంటుంది. వీటి చక్రాలు సూర్యుని 24 దశలను ప్రతిబింబిస్తాయి. అద్భుతమైన ఆర్కిటెక్చర్, విగ్రహాలు ఎంత చూసినా తనివి తీరదు. 

2 /5

గోవా చర్చ్  గోవా చర్చ్ అనేది పోర్చుగల్ కొలోనియల్ ఆర్కిటెక్చర్‌కు అద్భుత ఉదాహరణ. గోవాలో 16, 17వ శతాబ్దం సమయంలో చాలా చర్చిలు, మఠాలు నిర్మించారు. యూరోపియన్, ఇండియన్ ఆర్కిటెక్చర్ శైలికి అద్దం పడుతుంటాయి.

3 /5

అజంతా ఎల్లోరా గుహలు అజంతా ఎల్లోరా గుహల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బౌద్ధం, హిందూ, జైన మతాలతో సంబంధం కలిగిన ప్రాచీన రాతి నిర్మాణాలు. అంటే రాతిని తొలచి చేసిన నిర్మాణాలివి. 

4 /5

తాజ్ మహల్ తాజ్ మహల్ తెలియనివాళ్లుండరు. ప్రపంచపపు 7 వింతల్లో ఇదొకటి. భారతదేశపు అత్యంత ఆదరణ పొందిన పర్యాటక స్థలం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాుపకార్ధం 1632 నుంచి 1654 మధ్యలో తెల్లటి పాలరాతితో ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. మొఘల్ ఆర్కిటెక్చర్‌కు సజీవ సాక్ష్యమిది. ఓ విధంగా చెప్పాలంటే మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గుర్తింపు ఇచ్చింది. 

5 /5

ఆగ్రా కోట ఆగ్రా కోట 16వ శతాబ్దం నాటి విశాలమైన కట్టడం. మొఘల్ కాలం నాటి ఆర్కిటెక్చర్‌కు అద్భుతమైన ఉదాహరణ. ఈ కోటను 1542లో అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. మొఘల్ చక్రవర్తులకు ఇది కీలకమైన నివాసంగా ఉండేది.  ఎత్తైన గోడలు, విశాలమైన తలుపులు, తెల్లటి పాలరాతి భవనాలు అద్భుతంగా ఉంటాయి. 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించింది.