Viral video: సిగ్గు చేటు.. పింఛన్ తీసుకోవడానికి 70 ఏళ్ల వృద్దురాలి పాట్లు.. వైరల్ అవుతున్న వీడియో

మన దేశంలో పేదలకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ.. అవి పూర్తిగా కింద స్థాయి వరికి చేరటం లేదు. ఈ వీడియోలో కూడా అదే నిరూపితం అవుతుంది. 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ కోసం పడుతున్న పాట్లు అంతా - ఇంతా  కాదు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 01:53 PM IST
Viral video: సిగ్గు చేటు..  పింఛన్ తీసుకోవడానికి 70 ఏళ్ల వృద్దురాలి పాట్లు.. వైరల్ అవుతున్న వీడియో

Viral video: మన దేశంలో పేదలకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంది. అయితే ఆ సంక్షేమ పథకాల్లో ఎన్ని... ఎంత వరకు లబ్దిదారులకు చేరుతున్నాయి అనేది మాత్రం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి పట్టించుకోవడం లేదు. పథకాలు ఇస్తున్నాం.. పండగ చేసుకోండి అన్నట్లుగా ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ అవి అమలు అవుతున్న తీరు, అందుతున్న తీరు ఏమాత్రం సరిగా లేదని మరో సంఘటనతో నిరూపితం అయ్యింది. ఒడిశా కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ తీసుకోవడానికి పడ్డ కష్టం తాలూకు వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రభుత్వాల పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలంటూ నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. 

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన నబరంగ్ పూర్ జిల్లా ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామంలో సూర్య హరిజన్‌ అనే వృద్దురాలు ఉన్నారు. ఆమె తన పింఛన్ ను తీసుకునేందుకు కొన్ని కిలో మీటర్ల మేరకు నడుచుకుంటూ వెళ్లి ప్రతి నెల తీసుకోవాల్సి వస్తుంది. ఆమె నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. స్టాండ్‌ సహాయంతో ఆమె నడుస్తుంది. అయితే స్టాండ్ కూడా లేకపోవడంతో ఒక పాత కుర్చీ పట్టుకుని దాని సహాయంతో రోడ్డు పై కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ బ్యాంక్ కు చేరుకుంది. రోడ్డు మీద ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. 

ఎండలో కనీసం చెప్పులు లేకుండా బక్కపల్చని ఆ వృద్దురాలు పింఛన్ కోసం అంత దూరం వెళ్లడం ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది. ఇలాంటి సంఘటనలు మన దేశంలోనే జరుగుతూ ఉంటాయని నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనకు ఒడిశా ప్రభుత్వం స్పందించాలంటూ నెటిజన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. నిరుపేదలకు ప్రభుత్వ ఇచ్చే ఇలాంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కొందరు ప్రజా సంఘాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mammootty Mother : ఇండస్ట్రీలో విషాదం.. 'మెగాస్టార్'కి మాతృ వియోగం

ఈ సంఘటనపై స్థానిక ఎస్‌బీఐ అధికారి స్పందిస్తూ.. వృద్దురాలు చేతి వేలికి గాయం అయ్యింది. అందుకే ఆమె తన డబ్బును విత్ డ్రా చేసుకునే విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆమె సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నాడు.

Also Read: Csk Vs Srh Dream11 Prediction 2023: రోజు జరగబోయే మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య గట్టి పోటీ, గెలిచే టీమ్‌ ఇదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News