Businessman Died: పంటినొప్పితో క్లినిక్‌కి వెళ్లి.. గుండెపోటుతో చనిపోయాడు.. వైరల్ వీడియో

Businessman Died Of Heart Attack: పంటి నొప్పితో బాధపడుతున్న ఓ వ్యాపారి డెంటల్ క్లినిక్‌కి వెళ్లి అక్కడే న్యూస్ పేపర్ చదువుతూ హఠాత్తుగా కిందపడి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - Pavan | Last Updated : Nov 7, 2022, 08:52 PM IST
Businessman Died: పంటినొప్పితో క్లినిక్‌కి వెళ్లి.. గుండెపోటుతో చనిపోయాడు.. వైరల్ వీడియో

Businessman Died Of Heart Attack: రాజస్థాన్‌లోని బర్మర్‌లో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బర్మర్‌లో దిలీప్ కుమార్ మదాని అనే వ్యాపారి పంటి నొప్పితో బాధపడుతూ చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ డెంటల్ క్లినిక్ కి వెళ్లాడు. డెంటల్ క్లినిక్ రిసెప్షన్ లో డాక్టర్ కన్సల్టేషన్ లో భాగంగా తన వంతు కోసం వేచిచూస్తూ న్యూస్ పేపర్ చదవడం ప్రారంభించాడు. న్యూస్ పేపర్ చదువుతున్న క్రమంలోనే ఉన్నట్టుండి ఒక పక్కకు జారి ఓరగిలబడుతూ కనిపించిన దిలీప్ కుమార్ మదాని.. వెంటనే కిందపడిపోయాడు. దిలీప్ కుమార్ కిందపడి స్పృహ కోల్పోవడం గమనించిన రిసెప్షనిస్ట్ గట్టిగా కేకలు వేస్తూ అతడి వద్దకు పరిగెత్తుకెళ్లడం.. వెంటనే లోపల ఉన్న క్లినిక్ సిబ్బంది, ఇతర వ్యక్తులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్దారించారు.

దిలీప్ కుమార్ మదాని క్లినిక్ లోపలికి రావడం నుంచి మొదలుకుని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నట్టుండి కిందపడి చనిపోవడం వరకు దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దిలీప్ కుమార్ మదాని మృతి గురించి డెంటల్ క్లినిక్ డాక్టర్ కపిల్ జైన్ ని వివరణ కోరగా.. మదాని కుటుంబంతో మాట్లాడే వరకు తాను ఈ విషయంలో ఏమీ చెప్పలేనని అన్నారు. మదానికి గుండెపోటు వచ్చినట్టు మాత్రమే తెలిసిందని.. అంతకుమించి తనకు మరేమీ తెలియదని డా కపిల్ జైన్ తెలిపారు. 

ఇటీవల కాలంలో ఇలా ఉన్నట్టుండి గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు కూడా కొన్ని వార్తల్లోకెక్కడం, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనల గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తే.. గత అక్టోబర్ నెలలో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఓ జిమ్ ట్రైనర్ కుర్చిలో కూర్చుని ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి చనిపోవడం మనం చూసిందే.

దసరా నవరాత్రి వేడుకల సందర్భంగా గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తుండగానే ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

వినాయక చవితి వేడుకల సందర్భంగా జమ్మూలోని బిష్ణలో ఒక గణేష్ మండపం వద్ద వేసిన నాటిక ప్రదర్శనలో పార్వతి వేషం వేసిన 20 ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి స్టేజిపై పర్‌ఫామ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించిన ఓ 48 ఏళ్ల వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుకు గురై మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని బరేలిలోని ఇండియన్ వెటెరినరి రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా గుర్తించారు. తాజాగా డెంటల్ క్లినిక్ కి డెంటిస్ట్‌ని కలవడానికి వచ్చిన వ్యాపారి కూడా అదే తరహాలో ఉన్నట్టుండి గుండెపోటుకు గురై మృతి చెందడంతో ఇటీవల వైరల్ అయిన పాత ఘటనలను కూడా నెటిజెన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

Trending News