Operation Ganga: ఉక్రెయిన్​ను​ వీడుతూ భారత విద్యార్థుల జోకులు- నెటిజన్ల ఫైర్​!

Operation Ganga: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతుంటే.. కొంత మంది జోకులు వేసుకుంటూన్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే..!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 02:46 PM IST
  • ఉక్రెయిన్​ నుంచి తరలి వెళ్తూ జోకులు వేసుకున్న భారత విద్యార్థులు!
  • ఆ యువతి, యువకులపై ఫైర్​ అవుతున్న నెటిజన్లు
  • ఇలాంటి వారికోసమా ప్రభుత్వం కష్టపడుతోంది అంటూ కామెంట్స్!
Operation Ganga: ఉక్రెయిన్​ను​ వీడుతూ భారత విద్యార్థుల జోకులు- నెటిజన్ల ఫైర్​!

Operation Ganga: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఉక్రెయిన్​లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్​లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తోది. ఇందుకోసం 'ఆపరేషన్ గంగా' పేరుతో.. భారతీయులను సురక్షితంగా స్వదేశాలకు రప్పిస్తోంది.

అత్యంత క్లిష్టంగా రెస్క్యూ ఆపరేషన్..

ఉక్రెయిన్​ మీదుగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన కారణంగా.. భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. దీనితో కేంద్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న వారిని.. రోడ్డు మార్గం ద్వారా సమీప దేశాలకు తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి రప్పిస్తున్నారు.

ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు విదేశాంగ శాఖ రాత్రి, పగలు తేడా లేకుండా కృషి చేస్తోంది. ఉక్రెయిన్​ చిక్కుకున్న భారతీయుల్లో ఎక్కువ మంది విద్యార్థులే కావడంతో వారి భద్రతపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో ప్రభుత్వం అందరినీ సురక్షితంగా తీసుకువస్తామని.. ఏ ఒక్కరిని కూడా ప్రమాదంలో వదిలేయమని హామీ ఇచ్చింది. ఇందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించింది.

క్లిష్టపరిస్థితులపై ఎగతాళి..

ప్రభుత్వం ఇంత కష్టపడి.. ఎవరికీ ఎలాంటి అపాయం రాకుండా కృషి చేస్తుంటే.. కొందరేమో ఇంత క్లిష్టమైన పరిస్థితులను ఎగతాళి చేస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటకు రప్పించేందుకు ఎంతో మంది నిద్రాహారాలు మాని పని చేస్తున్నా.. జోకులు వేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బీజేపీ ఐటీ విభాగ అధిపతి.. పునిత్ అగర్వాల్ ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశారు. అందులో కొంత మంది ఓ వ్యాన్​లో పోలాండ్​కు వెళ్తున్నారు. కాగా ఓ యువతి తన ఫోన్ తీసి.. మేము పోలాండ్ వెళ్తున్నాం అని చెప్పింది. పక్కన ఉన్న ఓ యువకుడు 'రక్షించండి' అంటూ జోకులు వేశాడు. ఆ వ్యాన్​లో ఉన్నవాళ్లంతా అలానే ఎగతాళిగా మాట్లాడటం వంటివి చేశారు. ఆ వ్యాన్​లో ఉన్న వాళ్లంతా.. తాము ఉన్న పరిస్థితిని కనీసం పట్టించుకోకుండా ప్రవర్తించినట్లు ఆ వీడియోలో ఉంది.

దీనితో ఆ వీడియోను షేర్ చేస్తూ.. 'ఇలాంటి సిగ్గులేని వాళ్ల కోసం భారత ప్రభుత్వం రాత్రి, పగలు అని తేడా లేకుండ కష్టపోడుతోంది' అని రాసుకొచ్చారు పునిత్ అగర్వాల్​.

నెటిజన్ల ఫైర్..

ఈ వీడియో చూసిన ఇతర ట్విట్టర్ యూజర్లు కూడా.. ఆ వ్యాన్​లో ఉన్న వాళ్లపై మండిపడుతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారి ప్రవర్థనపై విమర్శలు చేస్తున్నారు.

మరికొందరేమో.. వాళ్ల డిగ్రీలను రద్దు చేయాలని సూచిస్తున్నారు.

ఇక ఈ వీడియోకు రిప్లే ఇచ్చిన ఓ ట్విట్టర్ యూజర్​.. అదే ఉక్రెయిన్​ నుంచి ఓ బస్సులో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న విద్యార్థులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో విద్యార్థులంతా భారత జాతీయ పతాకాలను పట్టుకుని వందేమాతరం అంటు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Also read: పర్సు లాక్కోవాలని చూసిన ఇద్దరు దొంగలు.. వారి స్కూటీనే ఎత్తుకెళ్లిన సూపర్ గర్ల్! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Also read: Viral video: మాస్క్ పెట్టుకోవడంలో ఇంత కష్టముందా.. ఫన్నీ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News