Poha Recipe with Rasgulla, Banana, Curd: రసగుల్లా, అరటి పండు, పెరుగుతో వెరైటీ పోహా రెసిపి

Poha Recipes with Rasgulla, Banana And Curd: ఇంట్లో స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లికి తన పిల్లలకు వీలైనంత త్వరగా రుచికరమైన స్నాక్స్ ఏం చేసి బాగుంటుంది అని వెదికితే.. వారికి కళ్ల ముందు కనిపించే అతికొద్ది ఆప్షన్స్‌లో ఈ పోహా రెసిపీలు కూడా ఉంటాయి. పోహాతో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే.. అధిక బరువు తగ్గాలని డైటింగ్ చేసే వాళ్లు చాలామంది ప్రిఫర్ చేసే ఫుడ్స్‌లో పోహా కూడా ఒకటి.

Written by - Pavan | Last Updated : Aug 23, 2023, 06:08 AM IST
Poha Recipe with Rasgulla, Banana, Curd: రసగుల్లా, అరటి పండు, పెరుగుతో వెరైటీ పోహా రెసిపి

Poha Recipes with Rasgulla, Banana And Curd: ఇండియాలో ఎక్కువ వినియోగంలో ఉన్న ఇన్‌స్టాంట్ స్ట్రీడ్ ఫుడ్స్‌లో ఇన్‌స్టాంట్ నూడుల్స్ తరువాత పోహా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఫేమస్ స్నాక్స్ జాబితాలో మ్యాగీ ముందు వరుసలో ఉంటే ఆ తరువాతి వాటిలో పోహా కూడా ఉంటుంది. పోహాను తయారు చేయడంలో ఒక్కో స్ట్రీట్ ఫుడ్ వెండార్‌ది ఒక్కో స్టైల్. దక్షిణాది ప్రాంతాల్లో కంటే ఉత్తరాదిన ఈ పోహా వెరైటీలు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుంటాయి. 

ఇంట్లో స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లికి తన పిల్లలకు వీలైనంత త్వరగా రుచికరమైన స్నాక్స్ ఏం చేసి బాగుంటుంది అని వెదికితే.. వారికి కళ్ల ముందు కనిపించే అతికొద్ది ఆప్షన్స్‌లో ఈ పోహా రెసిపీలు కూడా ఉంటాయి. పోహాతో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే.. అధిక బరువు తగ్గాలని డైటింగ్ చేసే వాళ్లు చాలామంది ప్రిఫర్ చేసే ఫుడ్స్‌లో పోహా కూడా ఒకటి. ఇలా కారణాలు ఏవైనా మన దేశపు ఆహారపు అలవాట్లలో పోహాతో చేసిన వంటకాలు ఎప్పుడో ఒక భాగమైపోయాయి.

అయితే, ఈ పోహా వంటకం కేవలం మన ఇండియాలోనే కాదు.. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో కూడా అంతే ఫేమస్ వంటకంగా గుర్తింపు దక్కించుకుంది. ఔను బంగ్లాదేశ్‌లో కూడా పోహాకు స్ట్రీట్ ఫుడ్స్ గా మంచి గిరాకీ ఉందట. ఇప్పుడు మేము మీకు ఒక వీడియో చూపించబోతున్నాం. కాకపోతే ఇండియాలో మీరు ఎప్పుడూ కనివిని ఎరుగని పద్ధతిలో ఈ వీడియో ఉంటుంది. అంతేకాదు... ఈ వీడియో చూస్తే ఇదేం వెరైటీ వంటకంరా బాబూ .. ఇంత వెరైటీగా ఉంది అని కూడా అనిపించక మానదు. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్ వెండార్ పోహాను అమ్ముతున్న పద్ధతి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఈ వీడియో గురించి మరింత చెప్పుకోవడానికి ముందు మీరే ఒకసారి స్వయంగా వీడియోపై లుక్కేయండి. ఆ తరువాత మరింత మ్యాటర్ మాట్లాడుకోవచ్చు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

 

వీడియో చూశారు కదండి.. ముందుగా ఒక బౌల్‌లోకి పోహాను తీసుకున్నాడు. ఆ తరువాత ఆ పోహాపై తియ్యదనం కోసం పంచదార పోశాడు. ఆ తరువాత ఒక అరటి పండు తీసుకుని దానిని అందులోనే ముక్కలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాడు. ఆ తరువాత పెరుగు కూడా దట్టించాడు. అంతటితో ఈ పోహా రెసిపి అయిపోలేదు... చివరకు రసగుల్లా కూడా యాడ్ చేశాడు. మీకు తెలిసిందే కదా.. రసగుల్లా అనేది మన ఇండియాలో కూడా చాలామందికి ఇష్టమైన స్వీట్ అని. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన ఎక్కువగా అమ్ముడయ్యే తీపి వంటకాల్లో ఈ రసగుల్లా కూడా ఒకటి. అలాగే ఈశాన్య భారతానికి పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా ఈ రసగుల్లాకు క్రేజ్ ఉంది అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. 

ఇది కూడా చదవండి : Viral Snakes Videos: ఆదమరిచి డాన్స్ చేస్తోన్న 2 పెద్ద నాగు పాములు.. వీడియో వైరల్

ఇక ఈ వీడియో విషయానికొస్తే.. పోహాపై పంచదార, పెరుగు, రసగులల్లా కలిపి ఒక ప్రత్యేకమైన పోహా రెసినిని తయారు చేశాడు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండార్. చూడ్డానికి ఎప్పుడూ చూడని కాంబినేషన్ కావడంతో ఆ పోహా టేస్ట్ ఎలా ఉంటుందా అని ట్రై చేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది కనుక అతడి గిరాకీకి కూడా డోకా లేనట్టుంది. ఓ ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో వెరైటీ పోహా రెసిపిగా భారీ స్పందన లభిస్తోంది. కానీ ఇలా ఇవన్నీ కలిపి తింటే మాత్రం అధిక బరువు పెరగడం ఖాయం. ఎందుకంటే పోహా ఆరోగ్యానికి మంచిదే కావచ్చు కానీ అందులో అతడు కలిపినవన్ని స్థూలకాయానికి దారితీసేవే అనే విషయం మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి : Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News